AU SFB-Ixigo co-branded Travel Credit Card Details :ప్రస్తుతం మార్కెట్లో కో-బ్రాండెండ్ క్రెడిట్ కార్డుల హవా నడుస్తోంది. SBI - బిగ్ బజార్, ఐసీఐసీఐ - అమెజాన్ పే, SBI - ఐఆర్సీటీసీ, ఫ్లిప్‌కార్ట్ - యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు.. ఇలా అనేక కో-బ్రాండెడ్ కార్డులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి పేరులోనే మనకు ఆయా కార్డుల ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలిసిపోతుంది. వీటి ద్వారా కేవలం ఆయా బ్రాండెడ్ సేవలను మాత్రమే కాకుండా.. సాధారణ క్రెడిట్ కార్డులా ఇతర అన్ని సేవలు కూడా పొందవచ్చు. కానీ.. ఆయా బ్రాండ్ సేవలపై ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అదనంగా లభిస్తాయి. మనం ఇప్పుడు అలాంటి కార్డు గురించి తెలుసుకుందాం.
Co Branded Credit Cards : కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్‌తో.. అదిరిపోయే బెనిఫిట్స్.. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే?
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అంటే ఏమిటి? :కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అంటే.. ఒక క్రెడిట్ కార్డు సంస్థ, ఒక ఉత్పత్తులు లేదా సేవలు అందించే సంస్థ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటాయి. ఆ తర్వాత.. రెండింటి పేరు కలిపి ఒక క్రెడిట్ కార్డు సృష్టిస్తాయి. ఇదే.. కో-బ్రాండెడ్ కార్డు. ఇలాంటి కార్డుల ద్వారా.. ఆ రెండు సంస్థలకు మాత్రమే కాకుండా.. ఆ క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తికి కూడా ప్రయోజనమే.
AU SFB-ఇక్సిగో కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ :
తాజాగా.. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ ఇక్సిగో భాగస్వామ్యంలో కో బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్ సాయంతో.. కస్టమర్లు విమాన, బస్సు, హోటల్ బుకింగ్‌లపై 10 శాతం వరకు తగ్గింపును పొందుతారు. అంతే కాకుండా.. రివార్డ్ పాయింట్లతో సహా అనేక ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
Credit Card Cashbacks Latest Update : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మీకో షాకింగ్ న్యూస్..!
AU SFB-ఇక్సిగో కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు:
- Ixigo-AU కో బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్.. ప్రయాణికుల కోసం రూపొందించబడింది.
- ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌తో.. ప్రయాణికులు ixigo ప్లాట్‌ఫారమ్ ద్వారా విమాన, బస్సు, హోటల్ బుకింగ్‌లపై 10% వరకు తగ్గింపును పొందవచ్చు.
- ఈ కార్డ్ USP అనేది రైలు ప్రయాణీకులకు వారి ప్రయాణాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చడానికి అందించబడింది.
- ఈ కార్డ్.. నెలలో రెండు సార్లు రైలు బుకింగ్ కోసం జీరో పేమెంట్ గేట్‌వే ఛార్జీలను అందిస్తుంది.
- అలాగే అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఖర్చులపై ఉత్తమ రివార్డ్ పాయింట్‌లను అందిస్తుంది.
- కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, క్యాలెండర్ సంవత్సరానికి 8 రైల్వే లాంజ్‌లు, 8 దేశీయ విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ ఇచ్చే ఏకైక OTA ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ఇదే.
- అదనంగా, ప్రతి సంవత్సరం ఒక అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది.
- జాయినింగ్ బోనస్‌గా కస్టమర్‌లకు కార్డ్ జారీ చేసిన మొదటి 30 రోజులలోపు వారి మొదటి సక్సెస్ ట్రాన్సాక్షన్‌పై 1000 రివార్డ్ పాయింట్‌లు అంతే కాకుండా రూ.1000 ఇక్సిగో డబ్బును కూడా పొందుతారు.
- కస్టమర్లు.. తమ లావాదేవీలపై 1 శాతం ఇంధన సర్‌ఛార్జి తగ్గింపును కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది.
- కార్డ్ నామినల్ వార్షిక రుసుము రూ. 999 (+GST). అయితే.. కార్డు తీసుకున్న తర్వాత.. మొదటి 30 రోజుల్లో ఆ క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.1000 ఖర్చు చేసినట్లయితే.. వార్షిక ఫీజు మాఫీ చేస్తారు.
- ఇక.. ఈ సంవత్సరంలో క్రెడిట్ కార్డుమీద కనీసం రూ.1 లక్ష ఖర్చు చేస్తే.. వచ్చే ఏడాది వార్షిక ఫీజు మాఫీ చేస్తారు.
Credit Card Portability Benefits in Telugu : క్రెడిట్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. పోర్టబిలిటీ ఆప్షన్ వచ్చేస్తోంది..!
How to get Virtual Credit Card : మీకు వర్చువల్ క్రెడిట్ కార్డు తెలుసా..? వెంటనే తెలుసుకోండి
Best Credit Cards For Dining in India: రెస్టారెంట్స్‌లో వాడేందుకు.. 10 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే!