తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన ఎల్​పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే? - ethanol rates in india

దేశంలో సిలిండర్ ధరలు తగ్గాయి. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటన వెలువరించాయి. ఎంత తగ్గించాయంటే?

commercial LPG rates down
commercial LPG rates down

By

Published : Oct 1, 2022, 10:46 AM IST

Updated : Oct 1, 2022, 12:18 PM IST

ఎల్​పీజీ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్​ పై రూ.25.5 మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో పాటు విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను సైతం 4.5 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపాయి. కాగా, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.

తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1859.50కి తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశీయంగా వీటి ధరలు కాస్త తగ్గుతున్నాయి. కమర్షియల్‌ సిలిండర్‌ ధరను తగ్గించడం గత జూన్‌ నుంచి ఇది ఆరోసారి. మొత్తంగా రూ.494.50 తగ్గించారు. 14.2 కేజీల ఈ సిలిండర్‌ ధర ప్రస్తుతం దిల్లీలో రూ.1053గా ఉంది. ఇక ఏటీఎఫ్‌ ధరపై రూ.5,527.17 (4.5శాతం) తగ్గించారు. దీంతో దిల్లీలో విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,15,520.27గా ఉంది.

దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు ప్రతి నెలకోసారి సవరిస్తుంటాయి. అదే ఏటీఎఫ్‌ అయితే ప్రతి 15 రోజులకోసారి మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా ఈ రేట్లను సవరిస్తారు. కాగా.. గత ఆరు నెలలుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.

మరోవైపు ఇథనాల్, బయో-డీజిల్‌తో కలపని ఇంధనాలపై ఎక్సైజ్​ డ్యూటీ విధింపును ఒక నెల వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. లీటర్‌కు రూ. 2 చొప్పున అదనపు ఎక్సైజ్​ డ్యూటీని విధించే నిర్ణయాన్ని ఒక నెల వాయిదా వేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదనపు ఎక్సైజ్ పన్ను విధించే గడువును అక్టోబర్1 నుంచి నవంబర్ 1కి మార్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ 10 శాతం ఇథనాల్​ను చెరకు లేదా మిగులు ఆహార ధాన్యం నుంచి సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.5 లక్షల కోట్లు.. కాగ్​ నివేదిక

షావోమీకి బిగ్ షాక్.. రూ.5551కోట్ల డిపాజిట్లు జప్తునకు లైన్ క్లియర్

Last Updated : Oct 1, 2022, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details