తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్‌పవర్‌, ఆర్‌ఇన్‌ఫ్రాలకు అనిల్‌ అంబానీ రాజీనామా.. - ఆర్‌పవర్‌, ఆర్‌ఇన్‌ఫ్రాలకు అనిల్‌ అంబానీ రాజీనామా

Anil Ambani News: రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ.. రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తన డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేశారు. సెబీ మధ్యంతర ఆదేశాల ప్రకారం.. బోర్డు నుంచి అనిల్‌ నిష్క్రమించారని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సైతం ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

Anil Ambani News
Anil Ambani News

By

Published : Mar 26, 2022, 5:38 AM IST

Anil Ambani News: రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తన డైరెక్టర్‌ పదవులకు రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ శుక్రవారం రాజీనామా చేశారు. ఎటువంటి నమోదిత కంపెనీతో అనుబంధం ఉండరాదన్న సెబీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 'సెబీ మధ్యంతర ఉత్తర్వులను పాటించే నిమిత్తం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హోదా నుంచి అనిల్‌ అంబానీ వైదొలిగార'ని బీఎస్‌ఈకిచ్చిన సమాచారంలో రిలయన్స్‌ పవర్‌ పేర్కొంది.

మరో వైపు, సెబీ మధ్యంతర ఆదేశాల ప్రకారం.. బోర్డు నుంచి అనిల్‌ నిష్క్రమించారని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సైతం ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కంపెనీ నుంచి నిధులను మళ్లించారన్న ఆరోపణలపై రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, అనిల్‌ అంబానీ, మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనరాదంటూ ఫిబ్రవరిలో సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ప్రజల నుంచి నిధులు సమీకరించాలని భావించే ఏ నమోదిత కంపెనీలోనూ వీరు డైరెక్టర్లు/ప్రమోటర్లుగా ఉండరాదని ఆ సమయంలోనే స్పష్టం చేసింది. అదనపు డైరెక్టర్‌గా రాహుల్‌ సరీన్‌ను నియమించినట్లు ఇరు కంపెనీలు తెలిపాయి.

ఇదీ చూడండి:మీ పేరుతో ఎవరో అప్పు చేస్తే.. ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details