తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​ రాజీనామా - అమెజాన్

అమెజాన్​లో తన 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు సంస్థ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​. ఈ మేరకు ఆయన సంస్థను వీడుతున్నట్లు అమెజాన్​ సీఈఓ ఆండీ జాస్సీ ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు.

Amazon retail CEO Dave Clark
అమెజాన్​ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​ రాజీనామా

By

Published : Jun 4, 2022, 3:49 PM IST

అమెజాన్​ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​ తన పదవికి రాజీనామా చేశారు. 23ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల వ్యాపార ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) డేవ్​ క్లార్క్​ సంస్థను వీడుతున్నట్లు అమెజాన్​ తాజాగా ప్రకటించింది. అమెజాన్​లో సరఫరా గోలుసులో వేగవంతం, వ్యాపార విస్తరణలో క్లార్క్​ కీలక పాత్ర పోషించారు.

"23 ఏళ్ల తర్వాత డేవ్​ క్లార్క్​ సంస్థను వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన చివరి పనిదినం జులై 1తో ముగియనుంది. అమెరికా సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్చేంజ్​ కమిషన్​(ఎస్​ఈఓ)కి దరఖాస్తు చేసింది. ఇతర అవకాశాలను అందుకునేందుకే క్లార్క్​ రాజీనామా చేశారు. ఆయన సంస్థలోని పలు బృందాలకు నాయకత్వం వహించారు. అమెజాన్​ రవాణా నెట్​వర్క్​ను నిర్మించారు. సంస్థలోని అన్ని రంగాల్లో నైపుణ్యతను పెంపొందించారు."

- ఆండీ జాస్సీ, అమెజాన్​ సీఈఓ.

డేవ్​ క్లార్క్​ తన ఎంబీఏ డిగ్రీ పూర్తయిన మరుసటి రోజునే 1999, మేలో అమెజాన్​ అమెజాన్​ ఆపరేషన్స్​ పాత్వేస్​ ప్రోగ్రామ్​లో చేరారు. '23 ఏళ్ల క్రితం నేను చేరినప్పుడు సంస్థ కేవంల ఆరు సెంటర్లతో చిన్నగా ఉండేది. కానీ, చాలా వేగంగా అభివృద్ధి చెందింది. నేను సీటెల్​కు వచ్చినప్పుడు కలుసుకున్న వ్యక్తుల ద్వారా అమెజాన్​లో అవకాశం వచ్చింది. ' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:40+ ఏజ్​లోనే రిటైర్ కావాలా? అయితే 'ఫైర్​' అవ్వాల్సిందే!

వంట గ్యాస్​పై రూ.200 రాయితీ వారికి వర్తించదా?

ABOUT THE AUTHOR

...view details