Amazon Prime Day Sale 2023 : షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్ ఈ జులై 15న ప్రారంభం కానుంది. ఈ సేల్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. వినియోగదారులు ఈ సేల్‌లో తమకు నచ్చిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్‌డే సేల్ జులై 15 అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. జులై 16 అర్థరాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుంది. అందుకే ఈ లిమిటెడ్ టైమ్‌లో మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్న ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, టెక్ గ్యాడ్జెట్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీ, ఫ్యాషన్ అండ్ బ్యూటీ, ఇంటికి సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్ మొదలైన అన్ని ఉత్పత్తులపై మంచి ఆఫర్లు, గొప్ప తగ్గింపు ధరలు ఉన్నాయి.
బుకింగ్ రోజే డెలివరీ!
Amazon prime day sale delivery time : అమెజాన్ తన ప్రైమ్ మెంబర్స్‌ను ఆనందపరచడం కోసం.. ఈ సారి బుకింగ్ రోజే డెలివరీ కూడా చేస్తామని స్పష్టం చేసింది. భారతదేశంలోని 25 ప్రధాన నగరాల్లో ఆర్డర్ చేసిన రోజు లేదా మరుసటి రోజు ఉత్పత్తులను అందిస్తామని స్పష్టం చేసింది. టైర్ 2 నగరాల్లో కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొంది.
అమెజాన్ ప్రైమ్ సేల్ - బ్యాంక్ ఆఫర్స్
Amazon prime day bank offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో బ్యాంకులు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డులపై ఈఎంఐ లావాదేవీలకు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాదు అనేక ప్రైమ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ సేల్ - స్మార్ట్‌ఫోన్ డీల్స్
Amazon prime day phone deals: ఈ అమెజాన్ ప్రైమ్ సేల్‌లో టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీస్ (ఉపకరణాలు)పై 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని బెస్ట్ డీల్స్ చూద్దాం రండి.
- iPhone 14 offers : ప్రైమ్ డే సేల్‌లో ఐఫోన్ 14 కేవలం రూ.66,499కే లభించనుంది.
- amazon prime day Samsung deals : గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ కేవలం రూ.16,999కే అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎం14 5జీ రూ.12,490 ధరకే లభిస్తుంది. శాంసంగ్ ఎంట్రీ లెవల్ ఫోన్స్.. ఎం సిరీస్, ఎమ్04లు కేవలం రూ.6,999 ధరకే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 పై రూ.6000, గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఫోన్లపై రూ.7000 వరకు బ్యాంకు డిస్కౌంట్ లభిస్తుంది. వీటితో పాటు రూ.8000 వరకు అదనపు డిస్కౌంట్ బోనస్ లభిస్తుంది.
- Oneplus offers on amazon prime day:వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌పై రూ.5000 వరకు ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. నార్డ్ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర రూ.17,999 నుంచి మొదలవుతాయి. అమెజాన్ కూపన్స్ ఉపయోగించి, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ ఫోన్‌ను చాలా మంచి ఆకర్షణీయమైన ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇటీవల లాంఛ్ అయిన వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 వరకు ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితోపాటు పాతఫోన్ మార్పిడిచేస్తే, మరో రూ.6000 వరకు ఆదా అవుతుంది.
- మోటరోలా సెల్‌ఫోన్ ఆఫర్స్ :ఇటీవల విడుదలైన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా.. స్మార్ట్‌ఫోన్స్ వరుసగా బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి రూ.54,999; ధర రూ.82,999కే అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరో రూ.3000 వరకు ఆదా చేసుకోవచ్చు.
- రియల్మీ స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్స్ :అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రియల్మీ నార్జో 60 సిరీస్ ఫోన్లపై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బ్యాంకు ఆఫర్లతో రియల్మీ నార్జో 60 5జీ కేవలం రూ.17,999కు, నార్జో 60 ప్రో రూ.23,999కు లభిస్తాయి. ఇక రియల్మీ నార్జో ఎన్55, రియల్మీ నార్జో ఎన్53 ఫోన్ల ధరలు రూ.8,999తో ప్రారంభం కానున్నాయి.
- ఐకూ ఫోన్ డీల్స్ :బ్యాంకు ఆఫర్లతో ఐకూ నియో 7 ప్రో 5జీ కేవలం రూ.33,999 లకే లభిస్తుంది. ఇటీవల లాంఛ్ అయిన ఐకూ జెడ్7ఎస్ 5జీ రూ.2000 డిస్కౌంట్‌తో రూ.16,999కే సొంతం చేసుకోవచ్చు. ఐకూ జెడ్6 లైట్ 5జీ (6జీబీ) ఆఫర్లతో కలిపి రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు.
- అమెజాన్ ప్రైమ్ డే డీల్స్‌లో షావోమీ స్మార్ట్ఫోన్లపై గొప్ప తగ్గింపు ధరలను పొందవచ్చు. షావోమీ 13 ప్రో 5జీపై ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.10000 వరకు తగ్గింపు లభిస్తుంది.
- Redmi K50i 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ రెడ్మీ ఫోన్ కేవలం రూ.20,999కే లభిస్తుంది.
- టెక్నో ఫోన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. CAMON 20 ప్రీమియర్ ఫోన్ ఆఫర్లతో కలిపి రూ.29,999లకే అందుబాటులో ఉంది. దీనితో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే బోనస్ ఆఫర్ కింద రూ.8000 వరకు ఆదా చేసుకోవచ్చు.
- తొలి తరం వారి అభిమాన బ్రాండ్ నోకియా కూడా ఈ ప్రైమ్ సేల్‌లో మంచి ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. నోకియా సీ12 ధర ఆఫర్లతో కలిపి రూ.5,129కే లభిస్తుంది.
- లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ అన్ని ఆఫర్లతో కలిపి, కేవలం రూ.10,499కే అందుబాటులో ఉంది.
ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లోని ముఖ్యమైన డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ గురించి తెలుసుకుందాం.
Amazon Prime Day Sale Deals and discounts and offers :
మొబైల్, యాక్సెసరీస్ ఆఫర్స్, డిస్కౌంట్స్
- సెల్ఫోన్లు, యాక్సెసరీస్ (ఉపకరణాలు)పై 40 శాతం వరకు డిస్కౌంట్
- నో కాస్ట్ ఈఎంఐ
- ఎక్స్ఛేంజ్ ఆఫర్