తెలంగాణ

telangana

ETV Bharat / business

షాపింగ్ ప్రియులకు గుడ్​ న్యూస్​.. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లలో భారీ డిస్కౌంట్​ సేల్స్​! - iphone 14 offers amazon

Amazon Prime Day Sale 2023 : ఈ కామర్స్​ దిగ్గజాలు అమెజాన్​​, ఫ్లిప్​కార్ట్..​ జులై 15 నుంచి భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు ప్రారంభించాయి. అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​ జులై 15, 16 వరకు కొనసాగనుండగా, ఫ్లిప్​కార్ట్ సేల్ మాత్రం జులై 19 వరకు ఉండనుంది. పూర్తి వివరాలు మీ కోసం..

flipkart big saving days 2023
Amazon Prime Day Sale 2023

By

Published : Jul 15, 2023, 12:56 PM IST

Amazon Prime Day Sale 2023 : షాపింగ్​ ప్రియులకు వెరీ గుడ్​ న్యూస్​. అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​, ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​ రెండూ శనివారమే ప్రారంభం అయ్యాయి. సెల్​ఫోన్స్​, ఎలక్ట్రానిక్స్​, గ్యాడ్జెట్స్​, టీవీలు, ఫ్యాషన్​ వస్తువులపై భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​ నడుస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ఏమిటో ఓ లుక్కేద్దామా?

Amazon Prime Day Sale 2023 : అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​ జులై 15, 16.. ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్​ పరికరాలైన స్మార్ట్​ఫోన్లు​, ల్యాప్​టాప్​లు​, టీవీలు, గృహోపయోగ వస్తువులపై భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్ అందిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్డర్​ చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే డెలివరీ కూడా చేస్తామని అమెజాన్​ స్పష్టం చేసింది.

Amazon Prime Day Phone Deals : ముఖ్యంగా ఈ ప్రైమ్​ డే సేల్​లో ఐఫోన్​ 14 అన్ని ఆఫర్లతో కలిపి కేవలం రూ.65,999కే అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ బ్రాండెడ్​ ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు, ఐసీఐసీఐ క్రెడిట్​ లేదా డెబిట్​ కార్డు ఉపయోగించి చేసిన పేమెంట్స్​పై 10 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తున్నారు. శనివారం ఐఫోన్​ 14 సహా టాప్​ బ్రాండ్​ ఫోన్లు సేల్​లో ఉంటాయి. ఆదివారం ఐకూ నియో 7 ప్రో 5జీ, వన్​ప్లస్​ నార్డ్​ 3 5జీ, రియల్​మీ నార్జో 60 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్లు సేల్​కు రానున్నాయి.

Amazon prime membership plans : వాస్తవానికి ఈ ప్రైమ్​ డే సేల్​ ప్రైమ్​ మెంబర్స్​కు మాత్రమే. ఒక వేళ మీరు ఈ గ్రాండ్​ సేల్​లో బెస్ట్ ఆఫర్స్ పొందాలంటే, అమెజాన్​ ప్రైమ్​ను సబ్​స్క్రైబ్​ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్​ ఈ కామర్స్​ వెబ్​సైట్​ కేవలం రూ.299కే అమెజాన్​ ప్రైమ్​ నెలవారీ సబ్​స్క్రిప్షన్​ను అందిస్తోంది. రూ.599కి 3 నెలల సబ్​స్క్రిప్షన్​, రూ.1499కి ఏడాది సబ్​స్క్రిప్షన్​ ఇస్తోంది. అంతే కాదు మొదటిసారిగా అమెజాన్​ ప్రైమ్ వాడుతున్నవారికి ఒక నెలపాటు ఉచిత ట్రయల్​ను కూడా అందిస్తోంది.

Flipkart big saving days 2023 :
వాల్​మార్ట్​కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్​ కంపెనీ ఫ్లిప్​కార్ట్​ జులై 15 నుంచి జులై 19 వరకు బిగ్​ సేవింగ్​ డేస్​ను నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

Flipkart big saving days Discounts and Offers :టీవీ అండ్​ అప్లయన్సెస్​పై 75 శాతం వరకు, ఫర్నీచర్​పై 80 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లపై 60 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్​పై 80 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. ఫ్యాషన్​ దుస్తులు, వస్తువులపై 50% నుంచి 80% వరకు భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. ఇవే కాదు ఇంకా అనేక కేటగిరీల వస్తువులపై భారీగా బ్యాంకు డిస్కౌంట్లు, ఆఫర్లు, డీల్స్ కూడా ఇస్తోంది.

Flipkart big saving days Bank offers : ఈ ఫ్లిప్​కార్డ్ బిగ్​ సేవింగ్ డేస్​ సేల్​లో యాక్సిస్​ బ్యాంకు క్రెడిట్​, డెబిట్​ కార్డులను ఉపయోగించి షాపింగ్​ చేస్తే, అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.
Flipkart Plus membership offers : వాస్తవానికి ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ సబ్​స్క్రైబర్లకు జులై 14 నుంచే ఈ బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​ ప్రారంభమైంది. మిగతావాళ్లకు ఈ రోజు నుంచి జులై 19 వరకు సేల్​ నడుస్తుంది.

ఎక్స్ఛేంజ్​ ఆఫర్స్​
Flipkart exchange offers : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​లో వస్తువులను కొనడం మాత్రమే కాదు. మన దగ్గర ఉన్న పాత ఫోన్లు కూడా అమ్మడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓల్డ్​ ఫోన్​ సేల్​ ద్వారా గరిష్ఠంగా రూ.40,000 వరకు పొందడానికి అవకాశం ఉంది.

క్లియరెన్స్ సేల్​
Flipkart clearance sale :ఫ్లిప్​కార్ట్​ పనిలోపనిగా ఏసీ క్లియరెన్స్ సేల్​ కూడా నిర్వహిస్తోంది. దీనిలో ఏసీ ధరలు భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details