ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ఉద్యోగులను తొలగింపునకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రకటించారు. గత ఏడాది నవంబరు నుంచి అమెజాన్.. 18వేల మందిని తొలగించింది. తాజాగా కంపెనీ తీసుకున్న తొలగింపు నిర్ణయంతో.. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే తొలగింపులపై ఉద్యోగులకు సమాచారం ఇవ్వనున్నట్లు అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ తెలిపారు. ఏప్రిల్‌లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక మాంధ్యం భయాలతో 2022 నవంబర్ నుంచి అమెజాన్ సంస్థ వేల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. రానున్న రోజుల్లోనూ ఈ అస్థిరత కొనసాగే అవకాశం ఉన్నందునే ఉద్యోగులను తొలగించనున్నట్లు యాండీ జెస్సీ తెలిపారు. సంస్థ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సంస్థ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో క్లౌడ్ కంప్యూటింగ్, మానవ వనరుల విభాగం, ప్రకటనలు, ట్విచ్ లైవ్‌స్ట్రీమింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై.. ఈ తొలగింపుల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
ఫేస్‌బుక్ ఉద్యోగులకు మరో షాక్.. 10 వేల మంది లేఆఫ్..
కొద్ది నెలలుగా దిగ్గజ కంపెనీలన్ని ఆర్థిక సమస్యలతో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ కూడా భారీగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. గత నవంబరులో 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మెటా.. రెండో విడతలో మరో 10 వేల మందిని తొలగించనున్నట్లు వారం రోజుల క్రితం వెల్లడించింది. ఇదే విషయమై ఫేస్‌బుస్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఓ సందేశాన్ని సైతం ఉద్యోగులకు పంపారు. అంతే కాకుండా ఓపెన్ రోల్ విభాగంలో నియమిస్తామని చెప్పిన 5 వేల మందిని కూడా తీసుకోమని స్పష్టం జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటికి వెళ్లకుండా ఆఫీస్‌లోనే ఉండి పనిచేసిన మేనేజర్.. అయినా లేఆఫ్తో మస్క్ షాక్..
మీకు గుర్తుందా? ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ మొదటి సారి కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టినప్పుడు.. పనిభారంతో ఓ మేనేజర్ ఆఫీస్‌లోనే పడుకున్నారు. ఇంటికెళ్లే సమయం లేక.. స్లీపింగ్ బ్యాగ్‌లో అక్కడే సేదదీరారు. ఆఫీసులోని టేబుల్, చైర్ల వెనుక నిద్రపోయారు. అప్పట్లో ఆ ఫొటో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆమెనే ట్విట్టర్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసిన ఎస్తేర్ క్రాఫోర్డ్. ఇప్పుడు ఆమె స్టోరీ ఎందుకనుకుంటున్నారా? ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్.. ఆమెను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక నుంచి ఆఫీస్‌కు రావలసిన అవసరం లేదంటూ మెయిల్ చేశారు. కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆమెను.. కనికరం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి