తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ - Flipkart Big Billion Days sales

Amazon Great Indian Festival : పండగ సందడి మొదలైంది! అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లో ఈ నెల 23 నుంచి ప్రత్యేక అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 14, 2022, 7:55 AM IST

Flipkart Big Billion Days sales: ఇ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 23 నుంచి 'పండగ సీజను' ప్రత్యేక అమ్మకాలు ప్రారంభించనున్నాయి. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో 28-29 రోజుల పాటు ఈ అమ్మకాలు నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ 'ద బిగ్‌ బిలియన్‌ డేస్‌' విక్రయాలు సెప్టెంబరు చివరు వరకు కొనసాగుతాయి. 23వ తేదీకి 24 గంటల ముందే ప్రైమ్‌ సభ్యులకు ప్రత్యేక అమ్మకాల పథకాలు అందుబాటులోకి వస్తాయని అమెజాన్‌ ఇండియా తెలిపింది.

వివిధ విభాగాల్లో 2,000 కొత్త ఉత్పత్తులను విక్రయదార్లు తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ నూర్‌ పటేల్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమం తొలి విడతలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై 10% రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. దీపావళికి 3-4 రోజుల ముందు వరకు ఈ ప్రత్యేక అమ్మకాలు కొనసాగుతాయని పేర్కొంది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు అమితాబ్‌ బచ్చన్‌, అలియా భట్‌, ఎంఎస్‌ ధోని తదితర ప్రముఖులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details