Amazon 5G Mobile Offers : కొత్త టెక్నాలజీతో అనేక ఫోన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ ఫోన్ల విక్రయాలను పెంచేందుకు ఈ-కామర్స్ సంస్థలు అనేక ఆఫర్లు ఇస్తుంటాయి. పండుగల సీజన్‌తో సంబంధం లేకుండా సేల్స్ పెంచుకునేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. అయితే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కొన్ని 5జీ మొబైల్స్ కొనుగోలుపై ఏకంగా 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఇండియాలో 5జీ అందుబాటులోకి రావడం వల్ల 5జీ ఫోన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్‌లో ప్రముఖ బ్రాండ్లగా పేరున్న వన్‌ప్లస్, శామ్‌సంగ్, రియల్ మీ, ఇతర ఫోన్లపై రాయితీలు ప్రకటించింది అమెజాన్. ఈ ఆఫర్లు మే 31వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు అదనంగా మరిన్ని ఆఫర్లతో పాటు ఉచిత డెలివరీ, 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందే అవకాశాన్ని కూడా కల్పించింది.
iQOO 11 5G :
ఈ ఫోన్ ధర రూ.49,999గా ఉండగా.. రూ.5 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తోంది అమెజాన్. దీంతో పాటు 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కల్పిస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 2కే ఈ6 అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.