తెలంగాణ

telangana

ETV Bharat / business

Air India Offers : ఎయిర్ ఇండియా బంపర్​ ఆఫర్​.. రూ.1,470కే ఫ్లైట్​ టికెట్​! - business news in telugu

Air India Offers In Telugu : విమాన ప్రయాణికుల కోసం ఎయిర్​ ఇండియా బంపర్ ఆఫర్​​ ప్రకటించింది. కేవలం రూ.1,470 ప్రారంభ ధరతో ఎకానమీ క్లాస్​ విమానం టికెట్లను అందిస్తోంది. ​ బిజినెస్​ క్లాస్​ టికెట్లను కూడా కేవలం రూ.10,130లకు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు చూద్దాం.

Air India Offers 2023
airindia flight offers

By

Published : Aug 18, 2023, 12:57 PM IST

Air India Offers 2023 :ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా.. ఆగస్టు 17న '96 గంటల సేల్​'ను ప్రారంభించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణం చేసేవారికి బంపర్​ ఆఫర్స్​, డిస్కౌంట్స్​​ ప్రకటించింది. సెప్టెంబర్​ 1 నుంచి అక్టోబర్​ 31 వరకు చేసే విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

రూ.1470కే విమానం టికెట్!​
Air India Ticket Price : ఎయిర్​ ఇండియా దేశీయ విమాన మార్గాల్లో (Air India 4 Day Sale 2023) ఎకానమీ క్లాస్​ టికెట్స్​ను రూ.1,470 ప్రారంభ ధరతో అందిస్తోంది. బిజినెస్​ క్లాస్​ టికెట్లను రూ.10,130లకు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి సైతం ఇదే విధమైన డిస్కౌంట్స్​ అందిస్తున్నట్లు పేర్కొంది.

బోనస్​ పాయింట్స్ కూడా!
Air India Latest Offer : ప్రయాణికులు ఎయిర్​ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్లను పొందాలంటే.. ముందుగా airindia.com వెబ్​సైట్​లోకి వెళ్లి టికెట్లు బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎయిర్​ ఇండియా మొబైల్​ యాప్​లోనూ ఫ్లైట్​ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, యాప్​లో విమానం టికెట్స్ బుక్స్​ చేసుకుంటే కన్వీనియన్స్​ ఫీజు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక వేళ ప్రయాణికులు రిటర్న్​ టికెట్స్ కూడా బుక్​ చేసుకుంటే.. వారికి డబుల్​ లాయల్టీ బోనస్​ కూడా అందిస్తారు.

బుకింగ్​ టైమింగ్స్​
Air India Ticket Booking : ఆగస్టు 17న ఎయిర్​ ఇండియా టికెట్​ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 రాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బుకింగ్ ఆఫర్​ అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో టికెట్​ బుక్​ చేసుకున్నవారు 2023 సెప్టెంబర్​ 1 నుంచి 2023 అక్టోబర్​ 31 వరకు ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులు కేవలం ఎయిర్​ ఇండియా వెబ్​సైట్​, యాప్​లలో మాత్రమే కాకుండా.. ఆథరైజ్డ్​ ట్రావెల్ ఏజెంట్స్​, ఆన్​లైన్ ట్రావెల్​ ఏజెంట్స్ (OATs) ద్వారా కూడా టికెట్స్ బుక్​ చేసుకోవచ్చు.

స్పైస్​జెట్​ వర్సెస్​ ఎయిర్​ ఇండియా
Independence Day Spice Jet Offers :స్పైస్​జెట్​ ఇండిపెండెన్స్ సేల్​ పేరుతో విమాన ప్రయాణికులకు ఆఫర్స్​ ప్రకటించింది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా కూడా ఆఫర్స్ ప్రకటించడం గమనార్హం. స్పైస్​జెట్​ ఫ్రీడమ్ సేల్​లో భాగంగా రూ.1515 ప్రారంభ ధరలో విమానం టికెట్లు విక్రయిస్తోంది. ఈ టికెట్స్ బుక్​ చేసుకున్నవారు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు విమాన ప్రయాణాలు చేయవచ్చు.

ABOUT THE AUTHOR

...view details