తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ఇండియా మరో కీలక నిర్ణయం.. 500 విమానాలు కొనుగోలు.. రూ.8200 కోట్ల డీల్​! - జెట్​లైనర్​ను కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా

ప్రముఖ ఎయిర్​లైన్స్​ సంస్థ ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోయింగ్​, ఎయిర్​బస్ సంస్థల నుంచి 500 విమానాలను కొనుగోలు చేయనుందట.

Air India
ఎయిర్ ఇండియా

By

Published : Dec 11, 2022, 9:53 PM IST

దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమాన తయారీ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ నుంచి దాదాపు 500 విమానాలను ఆర్డర్ చేసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వీటి కొనుగోలుకు 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,200 కోట్లు)కు పైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నాయి.
ఎయిర్ ఇండియా ఆర్డర్ పెట్టిన వాటిలో ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 777, బీ777లతో సహా 400 నారో బాడీ జెట్‌లు, 100 వైడ్ బాడీ జెట్​లు ఉన్నాయని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details