తెలంగాణ

telangana

ETV Bharat / business

మీడియా రంగంలోకి అదానీ, ఎన్​డీటీవీలో పెట్టుబడులు - ఎన్​డీటీవీలో గౌతమ్​ అదానీ వాటాలు

దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ ప్రముఖ మీడియా సంస్థ ఎన్​డీటీవీలో పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ప్రతిపాదనలు విజయవంతమైతే 55 శాతం వాటా అదానీకి చెందిన కంపెనీలకు దక్కుతుంది.

Adani NDTV Purchase
adani group to purchase 29.18 per cent stake in NDTV

By

Published : Aug 23, 2022, 10:47 PM IST

Adani NDTV Purchase: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఎన్​డీటీవీలో వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎన్​ఎమ్​ఎల్,​ ఎన్​డీటీవీలో రూ.493కోట్లతో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. అదానీ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రధాన్ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇప్పటికే ఎన్​డీటీవీ ప్రమోటర్ సంస్థ అయిన ఆర్​ఆర్​పీఆర్​​ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 29.18 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేసింది.

అదానీ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏఎమ్​జీ మీడియా నెట్‌వర్క్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్ సంయుక్తంగా ఎన్​డీటీవీకి చెందిన కోటీ 67 లక్షల 62వేల 530 షేర్లను ఒక్కోటి రూ.294 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రతిపాదించాయి. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లలో ఎన్​డీటీవీ షేర్‌ విలువ రూ.366.20గా ఉంది. ఈ ప్రతిపాదనలు విజయవంతమైతే ఎన్​డీటీవీలో 55 శాతం వాటాలతో మెజార్టీ వాటాదారుగా ఆదానీ గ్రూప్‌ నిలవనుంది. ఎన్​డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌ ప్రస్తుతం ఈ సంస్థలో 32.26 శాతం వాటాలు కలిగి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details