Adani Group Stocks Fall : గురువారం అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ భారీగా నష్టపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ ఇప్పటికే 4 శాతానికి పైగా నష్టపోయింది. అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ, తాజాగా ఓసీసీఆర్పీ ఓ నివేదిక విడుదల చేయడమే ఇందుకు కారణం.
అలీ, చాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు.. బిలియనీర్ గౌతమ్ అదానీ కుటుంబ సభ్యుల సమన్వయంతో నిబంధనలకు విరుద్ధంగా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్లాట్ఫారం ఓసీసీఆర్పీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ అదానీ గ్రూప్ షేర్లను వదిలించుకుంటున్నారు. ఫలితంగానే గురువారం అదానీ గ్రూప్ షేర్లు అన్నీ ఒక్కసారిగా కుదేలవడం ప్రారంభమైంది.
ఖండించినా.. లాభం లేదు!
OCCRP Report On Adani : ఓసీసీఆర్పీ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని పేర్కొంది. అయినప్పటికీ మదుపరులు అదానీ గ్రూప్ స్టాక్స్‌ను వదిలించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.
భారీగా పతనం!
- Adani Green Energy Share Price : రూ.1.47 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్.. గురువారం బీఎస్ఈలో 4.43 శాతం మేర నష్టపోయి రూ.927.65కు చేరుకుంది.
- Adani Power Share Price : అదానీ పవర్ స్టాక్ 3.82 శాతం మేర నష్టపోయి రూ.315.85కు పడిపోయింది.
- Adani Enterprises Share Price : అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ ఆదానీ ఎంటర్ప్రైజెస్ 3.56 శాతం మేర కోల్పోయి రూ.2,424కు దిగజారింది.
- Adani Energy Solutions Share Price : అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.18 శాతం మేర క్షీణించి రూ.814.95కు పడిపోయింది.
- Adani Ports And SEZ Share Price :అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ స్టాక్ 2.75 శాతం మేర నష్టపోయి రూ.796.50కు దిగివచ్చింది.
- Adani Total Gas Share Price :అదానీ టోటల్ గ్యాస్ 2.74 శాతం మేర క్షీణించి రూ.634.60కు చేరుకుంది.
- NDTV Share Price : ఎన్డీటీవీ షేర్ ధర 2.69 శాతం మేర నష్టపోయి రూ.213.30కు దిగివచ్చింది.
- Adani Wilmar Share Price :అదానీ విల్మర్ స్టాక్ 1.83 శాతం మేర నష్టపోయి రూ.362.20కు పడిపోయింది.
- ACC Share Price : అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని ఏసీసీ షేర్ల వాల్యూ రూ.3.15 శాతం మేర తగ్గి రూ.1,937 వద్ద ట్రేడవుతోంది.
- Ambuja Cement Share Price : అంబుజా సిమెంట్ షేర్ విలువ 2.84 మేర క్షీణించి రూ.431.60 వద్ద కొనసాగుతోంది.
హిండెన్‌బర్గ్ నివేదిక
Hindenburg Research Report On Adani Group :గతంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ కూడా అదానీ గ్రూప్‌పై ఇలాంటి ఆరోపణలే చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీలు.. భారతీయ చట్టాలను, స్టాక్ మార్కెట్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. అప్పట్లో దీనిని గౌతమ్ అదానీ పూర్తిగా ఖండించారు. కానీ, ఇప్పుడు ఓసీసీఆర్పీ కూడా ఇదే విధంగా అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అన్ని కంపెనీల షేర్లు భారీ పతనం దిశగా కదలాడుతున్నాయి.