తెలంగాణ

telangana

ETV Bharat / business

పొరపాటున మీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయ్యాయా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్ - తెలియని అకౌంట్​ నుంచి డబ్బులు క్రెడిట్ అయితే

Accidental Payments Into Your Account : పొరపాటున వేరే అకౌంట్ల నుంచి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? ఆ డబ్బు మీకు సంబంధించిందో కాదో తెలియదా? అలాంటి సమయంలో ఏం చేయాలంటే?

Accidental Payments Into Your Account
Accidental Payments Into Your Account

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 10:36 AM IST

Accidental Payments Into Your Account :కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ బ్యాంక్​ కస్టమర్ల అకౌంట్లో అనుకోకుండా డబ్బులు జమ అయ్యాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో పొరపాటున వేరే వ్యక్తికి క్రెడిట్​ అవ్వాల్సిన డబ్బులు మన ఖాతాల్లోకి రావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

పొరపాటును మీ బ్యాంకు అకౌంట్​లో డబ్బులు జమ అయితే, అవి మీకు సంబంధం లేదు అని భావిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. చాలా మంది తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే డబ్బు, పోయే డబ్బు గురించి అంతగా పట్టించుకోరు. ఇది అంత మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మనకు సంబంధం లేని డబ్బు మన అకౌంట్​లో క్రెడిట్ అయినప్పుడు తొందరపడి దాన్ని విత్​డ్రా చేయవద్దు. ఆ డిపాజిట్‌తో నిజంగా మీకు ఏ సంబంధం లేదా? అనుకోకుండానే మీ ఖాతాలోకి వచ్చిందా అన్న సంగతిని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  • మీ అకౌంట్​కు సంబంధించి లావాదేవీలపై మీకు సంపూర్ణ అవగాహన అవసరం. క్రెడిట్‌, ఉపసంహరణ (విత్​డ్రా)పై అప్రమత్తంగా ఉండండి. అప్పుడే ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే గుర్తించేందుకు వీలవుతుంది.
  • తమ ఖాతాలో అనుకోకుండా డబ్బు క్రెడిట్​ అయినప్పుడు, దాన్ని వెంటనే విత్​డ్రా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సాంకేతికంగా పొరపాటున చేసే లావాదేవీ వల్ల ఇలా బ్యాంక్​ అకౌంట్​లో క్రెడిట్​ అవ్వవచ్చు. అంతమాత్రాన ఆ డబ్బు పూర్తిగా ఆ ఖాతాదారు సొంతం కాదు.
  • ఒక వేళ ఎవరైనా వ్యక్తులు, లేదా సంస్థలు తమ తప్పును గుర్తించి, సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుసుకొని, ఆ నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
  • కొన్నిసార్లు వ్యక్తులు, సంస్థలు ఫిర్యాదు చేసినప్పుడు బ్యాంకులు సంబంధిత అకౌంట్​ను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలూ లేకపోలేదు. అలాంటప్పుడు సమస్య మొత్తం పరిష్కారమైతేనే ఖాతాను మీరు ఉపయోగించుకోగలరు.
  • పొరపాటున మీ అకౌంట్​లో తప్పుగా డబ్బు జమ అయివుంటే అన్ని వివరాలూ ఒక సారి చూసుకోవాలి. ఆ డబ్బుతో మీకు ఎలాంటి సంబంధం లేదని భావించినప్పుడు బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి.
  • కొన్నిసార్లు ఖాతాలోకి డబ్బు ఏవిధంగా అకౌంట్​లోకి వచ్చిందో తెలుసుకోవడం సాధ్యం కాకపోతే బ్యాంకు ఆ వివరాలు సేకరిస్తుంది. మీ సూచనలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది.

అకౌంట్​లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నెగిటీవ్​లోకి వెళ్తుందా? - ఆర్​బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details