Can You Use International Mobile Number On Aadhaar Card : దేశంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ పొందడం చాలా అవసరం. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆధార్ అతి ముఖ్యం. ఆధార్ కేంద్రంలో మీ వ్యక్తిగత వివరాలు, ఐరిష్, ఫింగర్ ప్రింట్స్ సబ్మిట్ చేసి దానిని పొందవచ్చు. అలాగే మీ వివరాలు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసే సమయంలో మొబైల్ నంబర్‌ను ఇవ్వాలి. అయితే ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం ఎందుకు చేయాలి? ఇంటర్ నేషనల్ మొబైల్ నంబర్‌ను కూడా లింక్ చేయొచ్చా? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్‌కు మొబైల్ నంబర్ ఎందుకు అవసరం?
ఆధార్ అనేది ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య. ఇందులో మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం అవసరం. అప్పుడే మీరు ప్రభుత్వం అందించే సేవలను సులువుగా పొందడానికి వీలవుతుంది. ఎప్పుడైనా మీరు మీ ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేయాలనుకుంటే ఓటిపి అవసరం అవుతుంది. ఆ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తుంది. అందుకే మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయడం చాలా అవసరం.
ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్స్ అనుసంధానం చేయవచ్చా?
Can I Link A Foreign Mobile Number To An Aadhaar Card : ఆధార్‌తో కేవలం ఇండియన్ మొబైల్ నంబర్స్‌ను మాత్రమే లింక్ చేసేందుకు వీలుంది. ఆధార్‌ను జారీ చేసేటువంటి యూఐడిఏఐ ప్రస్తుతానికి అంతర్జాతీయ మొబైల్ నంబర్లను తీసుకోవడం లేదు. అందువల్ల కేవలం భారతీయ మొబైల్ నంబర్లనే ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.