తెలంగాణ

telangana

ETV Bharat / business

గడువులోగా పాన్​-ఆధార్​ లింక్ చేయలేకపోయారా?.. అయితే పాన్​ను ఇలా యాక్టివేట్​ చేసుకోండి!

How to activate inoperative PAN : మీరు ఇంకా పాన్​-ఆధార్ అనుసంధానం చేయలేదా? మీ పాన్​కార్డ్​ పనిచేయడం ఆగిపోయిందా? అయితే వెంటనే త్వరపడండి. రూ.1000 అపరాధ రుసుము చెల్లించి, పాన్​ను యాక్టివేట్ చేసుకోండి. లేదంటే భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Aadhaar PAN linking
how to activate inoperative PAN

By

Published : Jul 7, 2023, 5:00 PM IST

PAN Activation Process : మీరు జులై 30లోపు ఆధార్​-పాన్​ కార్డులను లింక్​ చేయడం మర్చిపోయారా? అయితే జులై 1 నుంచి మీ పాన్​ పనిచేయడం ఆగిపోయి ఉంటుంది. దీని వల్ల మీపై అధిక టీడీఎస్​, టీసీఎస్​ భారం పడుతుంది.

ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం, ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆధార్​-పాన్​ కార్డులను అనుసంధానం చేసుకోవాలి. 80ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది. అలాగే అసోం, జమ్ము కశ్మీర్​, మేఘాలయ ప్రజలకు కూడా మినహాయింపు ఇచ్చారు. కానీ మిగిలిన ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా ఆధార్​-పాన్​ అనుసంధానం చేసుకుని తీరాలి. అయితే పలుమార్లు ప్రభుత్వం గడువు పొడిగించినప్పటికీ.. చాలా మంది పాన్​-ఆధార్​ అనుసంధానం చేయలేదు. దీనితో 2023 జూన్​ 30 వరకు రూ.1000 అపరాధ రుసుముతో ఆ రెండు కార్డులను లింక్​ చేసుకోవడానికి మరో అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయింది.

పెనాల్టీ కట్టి 'పాన్'​ను యాక్టివేట్​ చేసుకోండి!
Activate PAN Card online : ఒక వేళ మీరు గడువులోగా పాన్​-ఆధార్​ అనుసంధానం చేయకపోతే, జులై 1 నుంచి మీ పాన్ కార్డు ఇన్​ఆపిరేటివ్ అయిపోయి ఉంటుంది.​ అంటే పాన్​ పనిచేయడం ఆగిపోయి ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు కూడా దానిని యాక్టివేట్​ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకోసం సెక్యూరిటీస్​ డిపాజిటరీ లిమిటెడ్​ (NSDL) పోర్టల్​లో చలాన్​ నంబర్​ ITNS 280 కింద రూ.1000 పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది.

పెనాల్టీ చెల్లించినా పాన్​-ఆధార్​ లింక్​ కాలేదా?
PAN reactivation penalty : కొంత మంది అపరాధ రుసుము రూ.1000 చెల్లించినప్పటికీ ఆధార్​-పాన్​ కార్డు అనుసంధానం జరగలేదు. ముఖ్యంగా పెనాల్టీ చెల్లించినప్పటికీ, చలాన్​ డౌన్​లౌడ్​ కావడం లేదు. ఈ సమస్యపై ఆదాయపన్ను శాఖ స్పందించింది. యూజర్లు ఇన్​కం-టాక్స్ వెబ్​సైట్​లో లాగిన్​ అయిన తరువాత పోర్టల్​లో​ 'ఈ-పే ట్యాక్స్​' ట్యాబ్​లో చలానా స్టేటస్​ను తనిఖీ చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే చలానా చెల్లింపు విజయవంతమైతే, పాన్​ హోల్డర్లు.. ఆధార్​తో పాన్​ను లింక్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఆధార్​ - పాన్​ లింక్​ చేయకపోతే ఏమవుతుంది?
PAN inoperative effects : వాస్తవానికి బయోమెట్రిక్​ ఆధార్​తో పాన్​ను లింక్​ చేయకుండానే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేయవచ్చు. కానీ ఆధార్​-పాన్​ అనుసంధానం చేసేవరకు.. ఆదాయపన్ను శాఖ ఈ ఐటీఆర్​ను ప్రాసెస్ చేయదు. వాస్తవానికి ఆదాయపన్ను చట్టంలోని 114బీ ప్రకారం, పాన్​ లేకపోతే దాదాపు 15 రకాల లావాదేవీలు నిర్వహించలేము. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • బ్యాంకు అకౌంట్ ప్రారంభించలేము.
  • క్రెడిట్​ లేదా డెబిట్​ కార్డు దరఖాస్తు దాఖలు చేయలేము.
  • స్టాక్ బ్రోకింగ్​, డీమ్యాట్​ అకౌంట్​ ఓపెన్​ చేయలేము.
  • హోటల్​ లేదా రెస్టారెంట్​లో రూ.50,000 కంటే మించిన బిల్లులు నగదు రూపంలో చెల్లించలేము.
  • రూ.50,000 కంటే ఎక్కువ సొమ్ముతో మ్యూచువల్​ ఫండ్​ యూనిట్స్​ కొనుగోలు చేయలేము.
  • రూ.50,000 కంటే ఎక్కువ సొమ్ముతో డిబెంచర్లు, బాండ్లు తీసుకోలేము.
  • బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్​ చేయలేము.
  • రూ.50,000కు మంచిన బ్యాంకు డ్రాఫ్ట్​, పే ఆర్డర్​, బ్యాంకర్స్ చెక్​ తీసుకోవడం కుదరదు.
  • రూ.50,000కు మించిన టైమ్ డిపాజిట్​ చేయడానికి వీలుపడదు.
  • రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం ప్రీమియం ఉన్న బీమా పాలసీలను కొనుగోలు చేయలేము.
  • రూ.1,00,000కు మించిన సెక్యూరిటీలు (షేర్లు) కొనడం, అమ్మడం చేయలేము.
  • స్టాక్​ మార్కెట్​లో నమోదుకాని కంపెనీల్లో రూ.1,00,000 విలువకు మించి ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయడానికి వీలుపడదు.

పన్నుల భారం పడుతుంది!
పాన్ కార్డు క్రియాశీలకంగా లేకపోతే కొన్ని రకాల పనులకు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. అవి ఏమిటంటే..

  • మోటార్​ వాహనాలు కొనుగోలు చేస్తే, అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ద్విచక్ర వాహనాలకు ఈ విషయంలో మినహాయింపు ఉంది.
  • రూ.10 లక్షలు కంటే ఎక్కవ విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసినప్పుడు అధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది.
  • రూ.2 లక్షలకు మించిన విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి, సేవలను పొందడానికి అధికంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా అవకాశం ఉంది!

Aadhaar PAN linking : పాన్-ఆధార్​ అనుసంధానం చేయడానికి ఇంకా అవకాశం ఉంది. రూ.1000 అపరాధ రుసుము చెల్లించి పాన్​-ఆధార్​ అనుసంధానం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికైనా త్వరపడడం మేలు.

ABOUT THE AUTHOR

...view details