తెలంగాణ

telangana

ETV Bharat / business

'530 కోట్ల ఫోన్లు పక్కన పడేస్తారు.. రీసైక్లింగ్​కు కొన్నే'.. WEEE నివేదిక - mobile phones recycling

దాదాపు 530 కోట్ల మొబైల్‌ఫోన్లను వాటి యజమానులు ఈ ఏడాది పక్కన పెట్టే అవకాశం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. సరైన పద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు వీటిల్లో కొన్ని మాత్రమే చేరతాయని చెప్పింది. అసలేంటి ఈ నివేదిక? మొబైళ్లను పక్కన పెట్టడమేంటి?

mobile phones
mobile phones

By

Published : Oct 16, 2022, 9:15 AM IST

Mobile Phones Garbage: ఈ ఏడాదిలో దాదాపు 530 కోట్ల మొబైల్‌ఫోన్లను వాటి యజమానులు పక్కన పెట్టే అవకాశం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. సరైన పద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు వీటిల్లో కొన్ని మాత్రమే చేరతాయంది. ఎలక్ట్రానిక్‌ పరికరాలను మరమ్మతు చేసి వినియోగించుకోడానికి లేదా రీసైక్లింగ్‌ కోసం తీసుకురావడంలో ప్రజలు, వ్యాపార సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసుకునేందుకు బ్రసెల్స్‌కు చెందిన వేస్ట్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌ (డబ్ల్యూఈఈఈ) ఫోరమ్‌ సర్వే నిర్వహించింది.

జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 5 ఐరోపా దేశాలు- పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, రొమేనియా, స్లోవేనియాలకు చెందిన 7,775 మంది పాల్గొన్నారు. మరో బ్రిటన్‌ సర్వే ప్రకారం.. సామాన్య కుటుంబం తమ ఇంట్లో ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్‌ టూల్స్‌, హెయిర్‌ డ్రయర్‌, టోస్టర్‌, వంటి ఉపకరణాల సహా 74 ఇ-ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఇందులో 9 ఉత్పత్తులు పనిచేస్తున్నప్పటికీ వాడటం లేదని, 4 పాడైపోయినట్లు నివేదిక తెలిపింది.

మరిన్ని అంశాలు ఇలా..

  • పాడవుతున్న ఫోన్లను 9 మిల్లీమీటర్ల సగటు దూరంతో ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటే పోతే దాదాపు 50,000 కి.మీ దూరం వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూరం కంటే ఇది 120 రెట్లు అధికం. చంద్రుడికి వెళ్లే దూరంలో 8వ వంతు ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో పసిడి, రాగి, వెండి, పల్లాడియం, ఇతర పునర్వియోగ విడిభాగాలు ఉన్నప్పటికీ.. వ్యర్థాలుగా మారుతున్నవే ఎక్కువ.
  • ప్రజల వద్ద ఎక్కువగా ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో హెడ్‌ఫోన్స్‌, రిమోట్‌ కంట్రోల్‌లు, గడియారాలు, హార్డ్‌ డిస్క్‌లు, రూటర్‌లు, కీబోర్డ్‌, మైస్‌, టోస్టర్‌లు, గ్రిల్స్‌ వంటివి ఉన్నాయి.
  • 'ఈ ఏడాది చిన్న ఇ-వ్యర్థాలపై దృష్టి పెట్టాం. ఇళ్లలో వినియోగించని ఇటువంటి వస్తువులు సాధారణ చెత్తలోకి వెళ్లిపోతున్నాయి. వీటికి చాలా విలువ ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి' అని డబ్ల్యూఈఈఈ ఫోరమ్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాస్కల్‌ లెరాయ్‌ అన్నారు.
  • ఇవీ చదవండి:
  • సామాన్యులకు షాక్.. పాల ధరలు పెంపు
  • కట్టలు తెంచుకొని ఆకాశానికి ఎగబాకుతున్న డాలర్​​.. వాణిజ్య లోటుతో దేశాలు విలవిల!

ABOUT THE AUTHOR

...view details