Twitter Data Breach : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత సంస్థలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులను తొలగించిన మస్క్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించిన 50 లక్షల ట్విట్టర్ ఖాతా రికార్డులను చోరీకి గురైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంటర్నల్ బగ్ ద్వారా చోరీ చేసిన వివరాలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారని.. దీనికి అదనంగా మరో 10 లక్షల ట్విట్టర్ ప్రొఫైల్స్ సైతం విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలోనే ట్విట్టర్ డేటా చౌర్యానికి గురైనట్లు బ్లీపింగ్ కంప్యూటర్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది.
"ట్విట్టర్ డేటా చౌర్యానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడే లభించాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లోని అనేక ట్విట్టర్ ఖాతాలపై దీని ప్రభావం ఉంటుంది. డేటా చౌర్యం అయిన ఖాతాలను కొన్నింటిని పరిశీలించగా.. వారు నిజమేనని చెప్పారు. ఇది 2021 ముందు అయితే జరగలేదు."
--చాడ్ లోడర్, సెక్యూరిటీ నిపుణులు