GST on casinos in India: క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్ వేదికగా జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సమర్పించిన ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ! - జీఎస్టీ న్యూస్
GST on casinos in India: ప్రస్తుతం 18 శాతంగా ఉన్న క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై ఇకపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్ వేదికగా జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
gst on casinos in india
ప్రస్తుతం క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. గతేడాది మేలో ఈ మూడింటికి సంబంధించి మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో కమిటీ వేయగా.. ఈ మేరకు ప్రస్తుతం దీనికి సంబంధించిన సిఫార్సులు చేసింది. కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది ఆర్థిక మంత్రులు సభ్యులగా ఉన్నారు.
ఇదీ చదవండి:అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?