Hero Glamour 2023 Launch in India : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన అనేక మోడళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో స్ల్పెండర్ తర్వాత గ్లామర్ ఉంటుంది. అలాగే కుర్రకారు బాగా ఇష్టపడే ద్విచక్రవాహనాల్లోహీరో గ్లామర్(Hero) ముందుంటుంది. మార్కెట్లో ఈ బైక్‌కి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దానిని అందిపుచ్చుకునేందుకు ఈ గ్లామర్‌ను మరికొన్ని అదిరిపోయే ఫీచర్లతో అప్ గ్రేడెడ్ వర్షన్‌గా'గ్లామర్ 2023'(Hero Glamour 2023) పేరుతో ఈ నయా బైక్‌ను హీరో కంపెనీ రీ లాంచ్ చేసింది. ప్రస్తుతం రెండు వేరియంట్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ అప్డేటెడ్ గ్లామర్ బైక్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, వేరియంట్స్, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డిజైన్(Hero Glamour 2023 Design) :హీరో మోటోకార్ప్ కొత్తగా విడుదల చేసిన 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. పూర్తి డిజిటలైజ్ వెర్షన్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఈ బైక్‌ను రూపొందించారు.
ధర & వేరియంట్లు(2023 Hero Glamour Price) : ప్రస్తుతం 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హీరో గ్లామర్ 'డ్రమ్' వేరియంట్ ధర రూ. 82,348 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా.. హై-స్పెక్ 'డిస్క్' వేరియంట్ ధర రూ. 86,348 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
పవర్‌ట్రెయిన్ :కొత్త 2023 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌లో 125cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇందులోని ఇంజన్ 7,500rpm వద్ద 10.68bhp, 6,000rpm వద్ద 10.6Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. ఈ ఇంజిన్ కూడా తాజా BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది E20 ఇంధనంతో కూడా పనిచేసేలా నిర్మించారు. ఇది లీటరుకి 63కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.