పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పడకేసిన పారిశ్రామిక ప్రగతి! - undefined
రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో కాస్త పెరిగింది. ఆగస్టులో ఏడు శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. తాజాగా 7.41 శాతానికి చేరింది. మరోవైపు, ఏడు కీలక రంగాల ప్రగతిని సూచించే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 0.8శాతం క్షీణించింది.
సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఆగస్టులో ఏడు శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. తాజాగా 0.41 శాతం పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది. మరోవైపు, దేశంలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి 0.8శాతం క్షీణించింది. 2021 ఆగస్టులో ఐఐపీ వృద్ధి 13శాతం ఉండటం గమనార్హం. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) ప్రకారం.. ఆగస్టులో తయారీ రంగం 0.7శాతం క్షీణించగా... మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9శాతం పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి 1.4శాతం పెరిగింది.