2000 Notes Exchange News : రూ.2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ గడువు (అక్టోబర్ 7) రేపటితో ముగియనుంది. అయితే ఇప్పటి వరకు 96 శాతం మేర రూ.2000 నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని, ఇంకా రూ.12,000 కోట్ల విలువైన నోట్లు (3.37) మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 'ద్రవ్యపరపతి విధాన సమీక్ష' సందర్భంగా తెలిపారు.
"రూ.2000 నోట్ల చలామణిని నిలుపుదల చేసిన తరువాత.. ఇప్పటి వరకు 3.43 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. వీటిలో 87 శాతం వరకు బ్యాంకు డిపాజిట్లు ద్వారా, మిగిలిన 9 శాతం నోట్ల మార్పిడి ద్వారా జమ అయ్యాయి. ఇప్పుడు కేవలం రూ.12,000 కోట్లు (3.37%) విలువైన నోట్లు మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయి."
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
భారీ మొత్తంలో వెనక్కు వచ్చాయ్!
2000 Notes Remain In Circulation :కేంద్ర ప్రభుత్వం2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండేవి. వాటిలో రూ.3.44 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కు వచ్చాయి.