తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ దగ్గర రూ.2వేల నోట్లు ఇంకా ఉన్నాయా? RBIకి పోస్ట్​లో పంపితే ఈజీగా డిపాజిట్​ - రూ2వేల నోట్లు ఎక్చ్సేంజ్​

2000 Notes Deposit RBI : రూ.2వేల నోట్ల డిపాజిట్ విషయంలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రాలేని వారు.. పోస్ట్​ ద్వారా రూ.2000 నోట్లు పంపవచ్చని వెల్లడించింది. వాటిని ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్​ చేస్తామని తెలిపింది.

2000 Notes Deposit RBI
2000 Notes Deposit RBI

By PTI

Published : Nov 2, 2023, 1:48 PM IST

Updated : Nov 2, 2023, 2:22 PM IST

2000 Notes Deposit RBI :రూ.2వేల నోట్లను పోస్ట్​ ద్వారా తమ ప్రాంతీయ కార్యాలయానికి పంపితే.. వాటిని బ్యాంక్​ ఖాతాల్లో డిపాజిట్​ చేస్తామని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ప్రకటించింది. అందుకు TLR (ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్) ఫారమ్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. రిజర్వ్​ బ్యాంక్​ ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉన్నవారికి ఇది మంచి సదుపాయమని ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి దాస్ తెలిపారు.

"ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో సురక్షితంగా డిపాజిట్​ చేసుకునేందుకు రూ.2000 నోట్లను ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పోస్ట్​ ద్వారా పంపమని ప్రోత్సహిస్తున్నాం. కార్యాలయాలకు దూరంగా ఉన్న అనేక మందికి ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. TLR సురక్షితమైనది. ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. దిల్లీ కార్యాలయానికి ఇప్పటివరకు సుమారు 700 TLR ఫారమ్​లు అందాయి"

-- రోహిత్​ పి దాస్​, ఆర్​బీఐ రీజనల్​ డైరెక్టర్​

ఆర్​బీఐ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్​కు సంబంధించిన ఏర్పాట్లపై రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ స్పందించారు. దిల్లీ ఆర్​బీఐ కార్యాలయంలో సీనియర్​ సిటిజన్లతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. తక్కువ మొత్తంలో రూ.2వేల నోట్లు తెచ్చినవారికి కూడా ప్రత్యేక క్యూ ఉన్నట్లు తెలిపారు.

చట్టబద్ధంగానే..
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. సురక్షితమైన వెయిటింగ్​ ఏరియా ఏర్పాటు చేసినట్లు శక్తికాంత్​ దాస్​ చెప్పారు. ప్రస్తుతం రూ.2000 నోట్ల చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతున్నట్లు తెలిపారు. దిల్లీ పోలీసులు.. కార్యాలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారని సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

ఇప్పటివరకు 97 శాతానికి పైగా రూ.2వేల నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్​బీఐ ఇటీవలే ప్రకటించింది. ఇంకా రూ.10,000 కోట్ల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని తెలిపింది. 2023 మే19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్న సమయంలో దేశంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు సర్క్యులేషన్​లో ఉన్నాయని చెప్పింది. అక్టోబర్​ 31 నాటికి అందులో 97 శాతానికి పైగా తిరిగివచ్చినట్లు పేర్కొంది.

అయితే ఆర్​బీఐ మొదటిగా రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్​కు..​ సెప్టెంబర్​ 30 వరకు గడువు విధించింది. తరువాత ఈ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇప్పుడు దేశంలోని ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

రూ.2వేల నోట్లు ఇప్పుడు చెల్లుతాయా? మార్చుకోవాలంటే ఛార్జీలు చెల్లించాలా?

2000 Notes Exchange Last Date Extended : రూ.2000 నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన.. డిపాజిట్​/ ఎక్స్ఛేంజ్​​ గడువు అక్టోబర్ 7 వరకు పెంపు!

Last Updated : Nov 2, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details