2000 Note Exchange Last Date :రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి గడువు దగ్గరపడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అంటే ఇంకా ఐదు రోజులే మిగిలుంది. ఒకవేళ ఇప్పటికీ రూ.2 వేల రూపాయల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. నోట్ల మార్పిడికి మే 23 నుంచి బ్యాంకుల్లో మార్చుకునేందుకు అనుమతిచ్చింది.
2000 Note Exchange Last Date : రూ.2వేల నోట్ల మార్పిడికి 5 రోజులే ఛాన్స్.. గడువు పెంచుతారా?
2000 Note Exchange Last Date : రూ.2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు ముగుస్తోంది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బ్యాంకుల్లో ఈ నోట్లు మార్చుకోవచ్చు. ఆ తర్వాత రూ.2 వేల రూపాయల నోట్లపై ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Published : Sep 25, 2023, 3:38 PM IST
రోజుకు గరిష్ఠంగా రూ.20 వేలే..
2000 Note Exchange Limit Per Day :ఏదైనా బ్యాంకు శాఖలో ఒక రోజులో గరిష్ఠంగా రూ.20 వేల రూపాయల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అదే సాధారణ సేవింగ్స్ అకౌంట్లు, జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లకు మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. ఒకవేళ ఒకే రోజు రూ.50 వేల రూపాయలకు పైబడి డిపాజిట్ చేయాల్సి వస్తే మాత్రం ఐటీ నిబంధనల ప్రకారం పాన్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నోట్ల మార్పిడికి స్లిప్ గానీ, ధ్రువీకరణ పత్రం గానీ అవసరం లేదని ఆర్‌బీఐ చెప్పినప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రం ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.
గడువు ముగిసినా.. అవకాశం ఇవ్వొచ్చు!
సెప్టెంబర్ 1 నాటికి కేవలం 7 శాతం 2 వేల రూపాయల నోట్లు మాత్రమే వెనక్కి రావాలని ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన 24 రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి? ఇంకా మొత్తంగా ఎన్ని చేరుతాయి? అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోటు గురించి ఆర్‌బీఐ ఏం నిర్ణయం తీసుకుంటోందనేది ఆసక్తికరంగా మారింది. నిర్దేశిత గడువు దాటిన తర్వాత కూడా రూ.2 వేల రూపాయల నోటు లీగల్ టెండర్‌గా కొనసాగే అవకాశం ఉందని, లావాదేవీలకు అనుమతివ్వకుండా ఆర్‌బీఐ శాఖల వద్ద మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో డెడ్‌లైన్‌లోపు ఎందుకు మార్చుకోలేకపోయిందీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
- Currency Notes with Scribblings are not Invalid? : కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే.. నిజంగానే చెల్లవా..?
- Demat Nominee Deadline : ఈ గడువులోగా నామినీని యాడ్ చేయకపోతే.. మీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రీజ్!.. త్వరపడండి!
- New Financial Rules From October 1st 2023 : అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. త్వరగా ఈ పనులు పూర్తి చేయండి!