WhatsApp accounts banned: నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఫిబ్రవరిలో 14.26 లక్షల భారతీయుల ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. నిబంధనల ఉల్లంఘన గుర్తింపు, నివారణకు సంబంధించిన సొంత నిర్వహణ వ్యవస్థతోపాటు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. ఈ మేరకు మెసేజ్ ఫ్లాట్‌ఫాంలో నెలవారీ నివేదికను పోస్టు చేసింది.
14లక్షల మంది ఖాతాలను నిలిపేసిన వాట్సాప్ - whatsapp rules
WhatsApp accounts banned: నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 14.26 లక్షల మంది భారతీయుల ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 28 వరకు 335 ఫిర్యాదులు స్వీకరించింది. దీంతో పాటు 21 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
వాట్సాప్
ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 28వ తేదీ వరకు 335 ఫిర్యాదులు స్వీకరించినట్లు వాట్సాప్ తెలిపింది. దీంతో పాటు 21 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అందులో 194 ఫిర్యాదులు నిషేధం విధించాలని, మిగతావి అకౌంట్ సపోర్టు, ప్రోడక్ట్ సపోర్టు, భద్రత విభాగానికి చెందినవని వాట్సాప్ తెలిపింది. తమకు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించినట్లు వాట్సాప్ వెల్లడించింది.
ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రూ.1.42 లక్షల కోట్లు రాబడి