రూ.కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య డబుల్.. దిల్లీ కంటే ఏపీలోనే ఎక్కువ!
1 Crore Plus Per Year Earnings Individuals Doubled : దేశంలో ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదించేవారి వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2022-23 అసెస్మెంట్ ఇయర్లో మొత్తం 1,69,890 మంది వ్యక్తులు రూ.కోటికి పైగా వార్షిక ఆదాయాన్ని సంపాదించినట్లుగా వెల్లడించారని తెలిపింది. 2020-21 అసెస్మెంట్ ఇయర్‌తో పోలిస్తే ఈ సంఖ్య డబుల్ అయినట్లుగా అధికారులు తెలిపారు.
డబుల్ అయిన ఏడాదికి రూ.కోటికిపైనే సంపాదిస్తున్న వారు.. ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటే..
By
Published : Aug 7, 2023, 8:10 PM IST
1 Crore Plus Year Earnings Individuals Doubled : భారత్‌లో రూ.కోటికిపైగా వార్షిక ఆదాయం పొందేవారి వ్యక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు ఆదాయ పన్ను శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గత 2022-23 అసెస్మెంట్ ఇయర్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 1,69,890 మంది రూ.కోటికి పైగా వార్షిక ఆదాయాన్ని సంపాదించినట్లుగా వెల్లడించారని తెలిపింది. కాగా, 2020-21 అసెస్మెంట్ ఇయర్ నుంచి అసెస్మెంట్ ఇయర్ 2022-23కు ఈ సంఖ్య రెట్టింపయినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తెలిపారు. మొత్తం 81,653 మంది వ్యక్తులు(ఇండివిజువల్స్) రూ.కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లుగా 2020-21 అసెస్మెంట్ ఇయర్లో ప్రకటించారు. అయితే 2021-22 అసెస్మెంట్ ఇయర్లో రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న వారి సంఖ్య 1,14,446గా ఉంది. మొత్తంగా ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య డబుల్ కావడానకి రెండేళ్ల సమయం పట్టిందని నివేదిక వివరించింది.
ఏడాదికి రూ.కోటికి పైగా ఆదాయం సంపాదించిన వారి సంఖ్య ఇలా..
అసెస్మెంట్ ఇయర్
కోటికి పైగా ఆదాయం సంపాదించిన వ్యక్తులు
2022-23
1,69,890
2021-22
1,14,446
2020-21
81,653
2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు సహా మొత్తం 2.69 లక్షల మంది రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపించినట్లుగా ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీ రిటర్న్స్ డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారిలో 66,397 కంపెనీలు, 25,262 సంస్థలు, 3,059 ట్రస్టులతో పాటు 2,068 అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. మొత్తంగా గడిచిన గత మూడు అసెస్మెంట్సంవత్సరాల్లో దాఖలైన ఐటీఆర్‌ల సంఖ్య వివరాలిలా ఉన్నాయి.
అసెస్మెంట్ సంవత్సరం
ఐటీఆర్‌ల సంఖ్య
2022-23
7.78 కోట్లు
2021-22
7.14 కోట్లు
2020-21
7.39 కోట్లు
Andhra Pradesh Place In ITR Filings : 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ వివరాల ప్రకారం ఐటీఆర్‌లు ఫైల్ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ కాస్త మెరుగైన గణాంకాలతో రాజధాని దిల్లీ కంటే ముందు స్థానంలో కొనసాగుతోంది.