తెలంగాణ

telangana

ETV Bharat / business

దుమ్ము రేపిన జొమాటో​- స్టాక్ మార్కెట్లకు లాభాలు - స్టాక్ మార్కెట్ అప్​డేట్స్

స్టాక్​మార్కెట్లు వారాంతపు సెషన్​ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 139 పాయింట్లు పెరిగి.. 52,976 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 32 పాయింట్ల వృద్ధితో 15,850 మార్క్​ను తాకింది.

stock market
స్టాక్​ మార్కెట్​

By

Published : Jul 23, 2021, 3:42 PM IST

స్టాక్​మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ (Sensex today) 139 పాయింట్లు పెరిగి 52,976 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 32 పాయింట్లు వృద్ధి చెంది.. 15,856 వద్దకు చేరింది.

ఆర్థిక, ఫార్మా, ఐటీ షేర్లు లాభాలను ఆర్జించాయి. విద్యుత్​ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 53,114 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,653 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,899 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,768 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • ఐసీఐసీఐ బ్యాంక్​, ఐటీసీ, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎస్​బీఐ షేర్లు లాభాలను గడించాయి.
  • ఎల్​ అండ్​ టీ, ఏషియన్​ పెయింట్స్​, ఎన్​టీపీసీ, రిలయన్స్​, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూ.లక్ష కోట్లు దాటిన జొమాటో విలువ..

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలిరోజే జొమాటో షేర్లు దుమ్మురేపాయి. సంస్థ షేర్లు ఓ దశలో రూ.138కు చేరి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్లు దాటింది. బీఎస్‌ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన జొమాటో చేరింది. చివరగా ఈ రోజు సెషన్​లో సంస్థ షేర్​ విలువ రూ.125.20 వద్ద స్థిరపడింది.

ఇదీ చదవండి:వృద్ధి రేటు: భారత్​కు కోత- చైనాకు యథాతథం!

ABOUT THE AUTHOR

...view details