తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్బీఐ భరోసాతో రెండో రోజూ పుంజుకున్న ఎస్​ బ్యాంకు - ఎస్ బ్యాంకు షేర్లు

భారతీయ స్టేట్ బ్యాంకు భరోసాతో ఎస్ బ్యాంకు షేర్లు పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు ఈ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. సోమవారం భారీగా పడిపోయిన రిలయన్స్ షేర్లు కూడా నేడు పుంజుకున్నాయి.

yes bank
ఎస్ బ్యాంకు

By

Published : Mar 11, 2020, 12:57 PM IST

ఎస్​ బ్యాంకు షేర్లు వరుసగా రెండో రోజు కోలుకున్నాయి. ఇవాళ ట్రేడింగ్​లో 29 శాతం పెరిగి షేరు విలువ రూ.27.55కు చేరుకుంది. ఎస్​ బ్యాంకులో వాటా కొనుగోలుకు ఎస్​బీఐ సిద్ధం కావటం వల్ల మదుపరుల సెంటిమెంటు బలపడటమే ఇందుకు కారణం.

స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయిలో నష్టపోయిన సోమవారమూ ఎస్​ బ్యాంకు షేర్లు 31 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఎస్బీఐకి 49 శాతం వాటా

సంక్షోభంలో ఎస్ బ్యాంకును చక్కబెట్టేందుకు పునరుద్ధరణ పథకాన్ని తీసుకొచ్చింది ఎస్​బీఐ. ఇందులో భాగంగా ఎస్​ బ్యాంకులోని 245 కోట్ల షేర్లను రూ.2450 కోట్లకు దక్కించుకోనున్నట్లు తెలిపింది. ఒక్క షేరు విలువ రూ. 10గా ఉంది. బ్యాంకు పునర్విభజన తర్వాత ఈ షేర్లు 49శాతం వాటాగా బదిలీ అవుతాయని ఎస్​బీఐ తెలిపింది.

రిలయన్స్ షేర్లూ..

ఈ వారం తొలి సెషన్​లో 12 శాతం మేర నష్టపోయిన రిలయన్స్​ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ తిరిగి పుంజుకున్నాయి. సంస్థ షేర్లు 6 శాతం పెరిగాయి.

ఇదీ చూడండి:మారటోరియం ప్రభావంతో ఎస్​ బ్యాంక్​ షేర్లు పతనం

ABOUT THE AUTHOR

...view details