స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 871 పాయింట్లు క్షీణించి 49,159 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో 14,638 వద్ద స్థిరపడింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి లాక్డౌన్ విధించవచ్చన్న అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1449 పాయింట్లు పతనమైంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,028 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,580 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.