తెలంగాణ

telangana

మార్కెట్​ 2021: కొవిడ్​, టీకా​, బడ్జెట్​ వార్తలే కీలకం

By

Published : Jan 1, 2021, 3:56 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు, టీకాల అభివృద్ధి, భౌగోళిక రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్​, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఇవన్నీ 2021లో స్టాక్​ మార్కెట్లను నడిపించనున్నాయి. వీటిపైనే మదుపరులు కీలకంగా దృష్టి సారించనున్నారు. ఇవే మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. గతేడాది దాదాపు 16 శాతం వృద్ధి చెందిన సూచీలు.. అదే దూకుడు కొనసాగిస్తాయా? నిపుణులు ఏమంటున్నారు?

MARKET OUTLOOK
'కొవిడ్​, వ్యాక్సిన్​, బడ్జెట్​ వార్తలే మార్కెట్లకు కీలకం'

2020- స్టాక్​మార్కెట్లు ఎన్నో ఉత్థాన పతనాలు చవిచూసిన ఏడాది. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో మార్చి నుంచి కొద్దిరోజులు కుప్పకూలిన మార్కెట్లు.. అంతే వేగంగా కోలుకున్నాయి. గందరగోళ పరిస్థితుల్లోనూ మళ్లీ రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరాయి.

మరి 2021 సంవత్సరంలో స్టాక్​మార్కెట్లు ఎటు పయనించనున్నాయి? దేశీయ సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరుతాయా? నిపుణులు ఏమంటున్నారు?

అవే కీలకం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పరిస్థితులు, టీకాల అభివృద్ధిలో పురోగతి, భౌగోళిక రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్​, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ.. ఇవే మదుపరులపై ప్రభావం చూపనున్నాయి. 2020లో తలెత్తిన సమస్యలకు.. ఈ ఏడాది పరిష్కారం చూపుతుందని అభిప్రాయపడ్డారు కోటక్​ మహీంద్రా లైఫ్​ ఇన్సూరెన్స్​ హెడ్​(ఈక్విటీ) హేమంత్​ కనావాలా.

''2020 ఏడాదిలో కొవిడ్​ సంక్రమణ, లాక్​డౌన్​, సంక్షోభం చూస్తే.. 2021 మాత్రం వ్యాక్సినేషన్​, తిరిగి తెరుచుకోవడం, పునరుద్ధరణను చూడొచ్చు.''

- హేమంత్​ కనావాలా

ప్రస్తుతం మార్కెట్లు రికార్డు గరిష్ఠాల్లో ఉన్న కారణంగా.. కొంత కాలం మదుపరులు లాభాల స్వీకరణకు దిగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. కరోనా కేసులు పెరగకుండా ఉండి, మళ్లీ లాక్​డౌన్ పరిస్థితులు తలెత్తకుంటే ఇదే ట్రెండ్​ కొనసాగొచ్చని అభిప్రాయపడుతున్నారు. ​

అమెరికా మార్కెట్లు..

నూతన అమెరికా అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ.. మార్కెట్లపై ప్రభావం చూపే మరో ప్రధానమైన అంశం. కొత్త అధ్యక్షుడి పాలనలో భారత్​, అమెరికా వాణిజ్య సంబంధాలు కూడా మార్కెట్లను దిశానిర్దేశం చేస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

51 వేల ప్లస్​..

మార్కెట్ల ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. సెన్సెక్స్​ 51, 500, నిఫ్టీ 15,100 మార్కును సులభంగా దాటుతుందని అంచనా వేశారు వెంచురా సెక్యూరిటీస్​ హెడ్​ ఆఫ్​ రీసెర్చ్​ వినిత్​ బోలింజ్కర్​. ద్రవ్యలభ్యత, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం దీనికి కారణాలుగా చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: 2021కి లాభాల స్వాగతం- 14 వేల ఎగువన నిఫ్టీ

2020లో ఆర్థిక, ఫార్మా రంగాలు భారీ లాభాలను ఆర్జించాయి. ఈ ఏడాది ఆటోమొబైల్‌, బ్యాంకులు, లోహ, టెలికాం రంగాల కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని ప్రభావిత అంశాలు..

విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి మన దేశంలోకి.. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగొచ్చు. గతేడాది లాభాలకు ఇది కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

కొవిడ్‌ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఆతిథ్య-పర్యటక రంగాలకు ఇటీవలి పండుగల సీజన్‌ నుంచి మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా పర్యటకం, విమానయానం, రవాణా, హోటళ్లు, మల్టీప్లెక్సులు కేంద్రం నుంచి ప్యాకేజీని ఆశిస్తున్నాయి. బడ్జెట్​లో వీటిపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్​ కూడా అందుబాటులోకి వస్తే.. ఆయా రంగాలు రాణించే అవకాశముంది.

వృద్ధి రేటు అంచనాలు, బ్రెంట్​ ముడిచమురు ధరల సూచీ, రూపాయి కదలికలు కూడా కీలకం కానున్నాయి.

2020 మార్చిలో అత్యంత దారుణంగా సెన్సెక్స్​ 8,828 పాయింట్లు పడిపోయింది. ఇది 23 శాతం కావడం గమనార్హం. మార్చి 24న 25,639 వద్ద ఏడాది కనిష్ఠానికి చేరింది. ఇంతటి భారీ పతనం నుంచి కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అని అనుకుంటే, ఎంతో వేగంగా పైకి లేచి మదుపర్లను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. మళ్లీ డిసెంబర్​ 31న 47,897 వద్ద జీవిత కాల గరిష్ఠానికి చేరింది. సెన్సెక్స్​ ఏకంగా 16 శాతం పెరిగింది. మొత్తంగా గతేడాది 7 నెలలు సెన్సెక్స్​కు​ లాభాలు, 5 నెలల నష్టాలు వచ్చాయి.

ఇదీ చూడండి: డిసెంబర్​లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details