తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 59,500 దిగువకు సెన్సెక్స్ - Nifty today

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్(Sensex Today)​ 254 పాయింట్ల నష్టంతో 59,413కు చేరగా.. నిఫ్టీ(Nifty Today) 17,711 వద్ద ముగిసింది.

stocks close
stocks close

By

Published : Sep 29, 2021, 3:40 PM IST

Updated : Sep 29, 2021, 4:29 PM IST

ఒడుదొడుకుల ట్రేడింగ్ మధ్య దేశీయ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE sensex ) 254 పాయింట్లు నష్టపోయి59,413వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్​ఎస్​ఈ నిఫ్టీ(NSE Nifty) 37 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,711కు చేరింది. ఎఫ్ఎమ్​సీజీ, బ్యాంకింగ్​ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొగా.. ఫార్మా, ఐటీ షేర్ల కొనుగోలుకు మదుపరులు ఎక్కువ ఆసక్తి చూపించారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 59,678 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 59,111 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 17,782 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 17,608 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి షేర్లు..

ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, సన్ ఫార్మా, ఎస్​బీఐఎన్, టాటాస్టీల్, హెచ్​సీఎల్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాలు గడించాయి.

హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, హెచ్​యూఎల్, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Sep 29, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details