తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒపెక్ దేశాల డీల్​తో చమురు సూచీల పరుగులు - చమురు ధరలు

చమురు ఎగుమతి దేశాలు, భాగస్వాముల మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 7.7 శాతం, బ్రెంట్ చమురు ధర 5 శాతం ఎగబాకాయి.

OIL-MARKETS
చమురు ధర

By

Published : Apr 13, 2020, 9:56 AM IST

ఒపెక్ దేశాల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ సూచీ 7.7 శాతం వృద్ధి నమోదు చేసి బ్యారెల్ ధర 24.52 డాలర్లకు చేరింది. బ్రెంట్ సూచీ 5 శాతం ఎగబాకి బ్యారెల్​ ధర 33 డాలర్లకు పెరిగింది.

చారిత్రక ఒప్పందం..

కరోనా సంక్షోభం, రష్యా-సౌదీ మధ్య చముర యుద్ధం కారణంగా భారీగా పడిపోయిన క్రూడాయిల్​కు మద్దతు ధర లభించే విధంగా ఒపెక్ దేశాలు చారిత్రక ఒప్పందం చేసుకున్నాయి. మే, జూన్​ నెలల్లో రోజుకు 10 మిలియన్ బ్యారెల్​ల చమురు ఉత్పత్తి తగ్గించేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.

ఇందులో స్వల్ప మార్పులు చేస్తూ తగ్గింపును 9.7 మిలియన్ బ్యారెళ్లలకు పరిమితం చేయాలని ఆదివారం నిర్ణయించారు. ఈ కోతలను 2022 ఏప్రిల్ వరకు నెమ్మదిగా ఎత్తివేయాలని చమురు ఎగుమతి దేశాలు, భాగస్వాముల మధ్య ఒప్పందం కుదిరింది.

స్వాగతించిన ట్రంప్..

ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇంధన రంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధికి భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:చమురు ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్​ దేశాల కీలక ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details