తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2021, 3:46 PM IST

Updated : Nov 18, 2021, 3:57 PM IST

ETV Bharat / business

Stock market: మూడోరోజూ నష్టాలే- పేటీఎంకు భారీ షాక్​

దేశీయ స్టాక్​ మార్కెట్లు(Stock market today) వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 372 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 134 పాయింట్లు క్షీణించింది.

market
మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ఆటో, మెటల్స్​, ఐటీ సహా కీలక రంగాల్లో క్షీణతతో దేశీయ సూచీలు(Stock market today) వరుసగా మూడోరోజూ నష్టాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపరులు తమ సొమ్మును తరలించటమూ ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా వచ్చిన పేటీఎం లిస్టింగ్​ ప్రభావం సైతం ఉన్నట్లు తెలిపారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్(Sensex news)​ 372 పాయింట్ల నష్టంతో 59,636 వద్ద ముగిసింది.

  • 59,969 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ మొదటి నుంచే ఒడుదొడుకులకు లోనైంది. ఒకానొక దశలో 59,376 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 60,177 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 59,636 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ(Nifty today) 134 పాయింట్ల క్షీణతతో 17,765 వద్ద స్థిరపడింది.

  • ఇంట్రాడేలో.. 17,890 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ, ఒకానొక దశలో 17,945 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 17,765 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి..

ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​​ లాభాలతో ముగిశాయి.

టెక్​ మహీంద్ర, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్​, టాటాస్టీల్​, ఎల్​అండ్​ టీ, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేర్లు 2.5 శాతానికిపైగా నష్టాలు మూటగట్టుకున్నాయి.

పేటీఎం డీలా

వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (Paytm ipo price) (పేటీఎం మాతృ సంస్థ) ఆరంభంలోనే డీలాపడింది. గురువారం ఈ సంస్థ షేరు లిస్టింగ్‌కు రాగా.. ఇష్యూ ధర కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

స్టాక్‌ మార్కెట్లలో పేటీఎం షేరు ఇష్యూ(Paytm ipo price) ధరను రూ.2,150గా నిర్ణయించారు. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర కంటే 9.30 శాతం తక్కువగా రూ.1950తో లిస్ట్ అయ్యింది. బీఎస్‌ఈలోనూ 9 శాతం తగ్గి రూ.1,955 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పేటీఎం షేర్ విలువ మరింత కుంగి చివరకు 27 శాతం నష్టంతో రూ.1,564కు వద్ద స్థిరపడింది.

Last Updated : Nov 18, 2021, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details