తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపర్లు అప్రమత్తం- స్వల్ప లాభాల్లో సూచీలు - జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ

అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ పవనాలతో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. 60 పాయింట్ల వృద్ధితో 38,660 వద్ద సెన్సెక్స్​.. 2 పాయింట్ల లాభంతో 11,466 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది.

స్వల్ప లాభాల్లో సూచీలు

By

Published : Oct 17, 2019, 10:04 AM IST

Updated : Oct 17, 2019, 10:18 AM IST

అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ పవనాలు, లోహ రంగంలో నష్టాలతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. మదుపర్ల అప్రమత్తతతో నిఫ్టీ ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్​ రంగంలో లాభాలు, కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, ముడి చమురు ధరల తగ్గుదలతో స్టాక్​ మార్కెట్లకు స్వల్ప ఊతం లభించింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 60 పాయింట్ల లాభంతో 38వేల 660 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-నిఫ్టీ 2 పాయింట్ల వృద్ధితో 11వేల 466 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి...

హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, టీసీఎస్​, ఎన్​టీపీసీ, ఎషియన్​ పేయింట్స్​, ఎల్​అండ్​టీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​​ బ్యాంక్​, ఎస్​బీఐ, సన్​ ఫార్మా సంస్థలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

వేదాంత, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​ టెక్​, ఎంఅండ్​ఎం, టెక్​ఎం, టాటా మోటర్స్​ సుమారు 1.94 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోలిస్తే 3 పైసలు లాభపడి రూ.71.40కు చేరింది.

Last Updated : Oct 17, 2019, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details