తెలంగాణ రాష్ట్రంలో.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. బీఎస్ఈ గణాంకాల ప్రకారం గతేడాది నుంచి డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య వృద్ధిలో 153.11 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 12 నెలల వ్యవధిలో 8,39,700 కొత్త ఖాతాలు ప్రారంభమవ్యగా.. మొత్తం ఖాతాదారుల సంఖ్య 13,88,119గా ఉంది.
డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య వృద్ధిలో.. రెండో స్థానంలో తెలంగాణ - demat account holders
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం గతేడాది నుంచి డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య వృద్ధిలో153.11 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
తెలంగాణ డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య
డీమ్యాట్ ఖాతాల వృద్ధిలో మణిపూర్ 182.84 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో గత ఏడాది పాటు 6,83,637 డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. ఈ విషయంలో 30.37 శాతం వృద్ధి నమోదైంది.
దేశ వ్యాప్తంగా.. డీమ్యాట్ ఖాతాల సంఖ్య విషయంలో మాహారాష్ట్ర, గుజరాత్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 1.21 కోట్లు, గుజరాత్‌లో 74.31 లక్షల డీమ్యాట్ ఖాతాలున్నాయి. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 307, మిజోరాంలో 3,888 మంది డీమ్యాట్ ఖాతాదారులున్నారు.