గురువారం స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ అదరగొట్టింది. షేరు ధర 2.89శాతం పుంజుకోవడం వల్ల సంస్థ మూలధన విలువ రూ.12లక్షల కోట్లు దాటింది. రిలయన్స్ తర్వాత ఆ మార్క్‌ను దాటిన తొలి దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది.
బీఎస్ఈలో టీసీఎస్ షేరు 2.89శాతం పెరిగి వృద్ధితో రూ.3,250 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మొత్తం విలువ రూ.12,19,581.32 కోట్లకు చేరింది. టీసీఎస్ షేర్లు జనవరిలో ఇప్పటి వరకు 13 శాతం మేర వృద్ధి సాధించడం విశేషం.