తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాకింగ్ షేర్ల దూకుడు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 248 పాయింట్లు పెరిగి నూతన రికార్డు స్థాయి అయిన 49,500పైకి చేరింది. నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ఠమైన 14,550మార్కును దాటింది.

share market closing bell
స్టాక్​ మార్కెట్ల జోరు

By

Published : Jan 12, 2021, 3:54 PM IST

స్టాక్​ మార్కెట్లు లాభాల పంట పండించాయి. మంగళవారం సెషన్​లో బీఎస్‌ఈ సెన్సెక్స్​ 248 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠమైన 49,517 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79 పాయింట్ల మేర పెరిగి కొత్త రికార్డు స్థాయి అయిన 14,563 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో..

ఇవాళ్టి సెషన్​లో సెన్సెక్స్ 49,079 పాయింట్ల వద్ద కనిష్టాన్ని.. 49,569 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ 14,432 పాయింట్ల అత్యల్ప స్థాయిని, 14,590 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

కేంద్ర బడ్జెట్​పై ఆశలు.. టీకా పంపిణీ సానుకూలతల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు దూసుకెళ్లాయి.

లాభనష్టాల్లో..

ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ షేర్లు లాభాలు గడించాయి.

ఏషియన్​ పెయింట్స్, హిందుస్థాన్​ యూనీలివర్​, నెస్లే, టైటాన్​, కోటక్​బ్యాంకు షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చదవండి:పసిడి బాండ్ల జారీ షురూ- వారికి ప్రత్యేక డిస్కౌంట్​

ABOUT THE AUTHOR

...view details