స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,493 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,294 వద్దకు చేరింది.
- భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌టెక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోయాయి.