తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల పరంపర: మరింత దిగువకు స్టాక్స్ సూచీలు

గురువారం స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మందగమనం, దేశీయ మార్కెట్లపై మదుపర్ల విశ్వాసం సన్నగిల్లడం, అంతర్జాతీయ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కొనసాగుతున్న స్టాక్​మార్కెట్ల నష్టాల పరంపర

By

Published : Aug 22, 2019, 10:35 AM IST

Updated : Sep 27, 2019, 8:49 PM IST

స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. గురువారం దేశీయ స్టాక్ ​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక మందగమనం సెగ సూచీలను కిందకు లాగుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం, దేశీయ మార్కెట్లపై మదుపర్ల విశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లడమూ... నష్టాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్​ 122 పాయింట్లు కోల్పోయి 36 వేల 937 వద్ద కొనసాగుతోంది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచి నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 10 వేల 874 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

బ్రిటానియా, ఎల్​ అండ్​ టీ, కోటక్ బ్యాంకు, టీసీఎస్​, టెక్ మహీంద్ర, రెడ్డీ ల్యాబ్స్, ఐటీసీ, యూపీఎల్​, లార్సెన్, హెచ్​యూఎల్​, ఎమ్​ అండ్ ఎమ్​, ఏసియన్ పెయింట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

ఇండియా బుల్స్, బజాజ్​ ఫెన్సెర్వ్​​, ఆదాణీ పోర్ట్స్​, వేదాంత, బజాజ్​ ఫైనాన్స్​, ఎస్​ బ్యాంకు, ఓఎన్​జీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటాస్టీల్​, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

హాంకాంగ్​, కొరియా, షాంగై, జపాన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా బుధవారం వాల్​ స్ట్రీట్​ ఎక్స్ఛేంజిలు లాభాలతో ముగిశాయి.

రూపాయి

రూపాయి విలువ ప్రారంభ ట్రేడింగ్​లో 10 పైసలు తగ్గి... ఒక డాలరుకు రూ.71.66గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు 0.17 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచమురు ధర 60.20 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముతున్న నేత

Last Updated : Sep 27, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details