తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 375 ప్లస్​

STOCKS LIVE
స్టాక్ మార్కెట్లు

By

Published : Apr 22, 2021, 9:41 AM IST

Updated : Apr 22, 2021, 3:45 PM IST

15:42 April 22

బ్యాంకింగ్ షేర్ల జోరు..

స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 375 పాయింట్లు పెరిగి 48,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 14,406 వద్దకు చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టైటాన్​, అల్ట్రాటెక్​ సిమెంట్, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

14:16 April 22

నిఫ్టీ 100 ప్లస్​..

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా పెరిగి.. 48,011 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల లాభంతో 14,391 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, వాహన, ఫార్మా షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

13:28 April 22

నిఫ్టీ 50 ప్లస్​..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ తర్వాత లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా లాభంతో 47,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి.. 14,342 వద్ద కొనసాగుతోంది.

  • ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టైటాన్​, ఎం&ఎం, నెస్లే, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:51 April 22

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా పెరిగి 47,725 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లకుపైగా లాభంతో 14,311 వద్ద కొనసాగుతోంది.

హెవీ వెయిట్ బ్యాంకింగ్ షేర్లు పుంజుకోవడం, ఫార్మా కంపెనీల సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది. 

11:14 April 22

ఐటీ షేర్ల నేలచూపులు.. నష్టాల్లోనే సూచీలు

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 200, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి.. వరుసగా 47,505, 14,252 వద్ద కొనసాగుతున్నాయి. 

బ్యాంకింగ్​, ఫార్మా రంగాలు బలంగా కోలుకోగా.. ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి.

డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, ఎస్బీఐ, లాభాల్లో కొనసాగుతున్నాయి.

టైటాన్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, ​మహీంద్రా అండ్ ​మహీంద్రా, బజాజ్​ ఫిన్​సర్వ్ నష్టాల్లోనే ఉన్నాయి.

08:53 April 22

సూచీలకు కరోనా భయాలు

దేశంలో కరోనా ఉద్ధృతి రోజు రోజుకు తీవ్రమవుతున్న వేళ స్టాక్​ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు గురువారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి.

బీఎస్​ఈ-సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా నష్టంతో 47,338 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు కోల్పోయి 14,208 వద్ద కొనసాగుతోంది.

ఐటీ​ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటుండగా.. ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి.

  • డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్​ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Apr 22, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details