తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు నష్టాలే- సెన్సెక్స్​ 465 పాయింట్లు డౌన్​ - నిఫ్టీ

Stocks live updates
స్టాక్స్ లైవ్​ న్యూస్

By

Published : May 4, 2021, 9:30 AM IST

Updated : May 4, 2021, 3:48 PM IST

15:41 May 04

భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 465 పాయింట్లు క్షీణించి 48,253 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,496 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివివే..

బజాజ్​ ఫినాన్స్​, ఎస్​బీఐ, ఓఎన్​జీసీ, కోటక్​ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్​, టెక్​ మహీంద్రా షేర్లు లాభాలను ఆర్జించాయి.

సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, రిలయన్స్​, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతి, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:53 May 04

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 500కుపైగా పాయింట్లు కోల్పోయింది. ఎన్​ఎస్​సీ-నిఫ్టీ 150 పాయిట్లు క్షీణించింది. 

30షేర్ల ఇండెక్స్​లో బజాజ్​ ఫినాన్స్​ టాప్​లో ఉండగా.. మహీంద్ర అండ్​ మహీంద్రా చివరి స్థానంలో ఉంది. 

11:35 May 04

స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకుపైగా పెరిగి 48,902 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంతో 14,692 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్​, ఎం&ఎం, ఇన్ఫోసిస్, డాక్టర్​ రెడ్డీస్​, పవర్​ గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:49 May 04

స్టాక్ మార్కెట్లు సెషన్​ ప్రారంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. 

సెన్సెక్స్ 90 పాయింట్లకుపైగా కోల్పోయి 48,627 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా తగ్గి 14,599 వద్ద కొనసాగుతోంది.

09:08 May 04

14,650 పైకి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు మంగళవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయ. బీఎస్​ఈ-సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా పెరిగి 48,843 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంతో 14,679 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్​, ఐటీ, ఆటో, షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్​ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. 
  • హెచ్​యీఎల్​, టైటాన్​, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : May 4, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details