తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లపై బేర్ పంజా- సెన్సెక్స్​ 1000 పాయింట్లు పతనం - స్టాక్​ మార్కెట్​

stocks live updates
స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Oct 28, 2021, 9:33 AM IST

Updated : Oct 28, 2021, 3:01 PM IST

14:47 October 28

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు కుదేలవుతున్నాయి. బ్యాంకింగ్‌, లోహ, విద్యుత్తు, రియల్టీ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1000 పాయింట్లకుపైగా పడిపోయి.. 60,058 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 339 పాయింట్ల నష్టపోయి.. 17,871 వద్ద కొనసాగుతోంది.

13:36 October 28

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా పతనమై.. 60,424 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా నష్టపోయి.. 17,973 వద్ద కొనసాగుతోంది.

10:59 October 28

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 590 పాయింట్లకుపైగా దిగజారి.. 60,550 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టంతో 18,025 వద్ద ట్రేడవుతోంది. 

09:05 October 28

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 250 పాయింట్లకుపైగా పతనమై.. 60,893 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 80 పాయింట్లకుపైగా తగ్గి 18,130 వద్ద కొనసాగుతోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎల్​ అండ్​ టీ, బజాజ్​ ఆటో, ఎం అండ్​ ఎం, హిందుస్థాన్​ యూనిలివర్, బజాజ్​ ఫిన్​సెర్వ్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, టాటాస్టీల్​, ఐసీఐసీఐ బ్యాంకు,యాక్సిస్​ బ్యాంకు,హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఐటీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Oct 28, 2021, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details