తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు - స్టాక్​ మార్కెట్​ వార్తలు

STOCKS
దేశీయ సూచీలు

By

Published : Oct 16, 2020, 9:43 AM IST

Updated : Oct 16, 2020, 1:41 PM IST

13:39 October 16

బ్యాంకింగ్​, లోహ షేర్ల ఊతంతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 280 పాయింట్ల లాభంతో 40 వేల ఎగువన ట్రేడవుతోంది. 

నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి.. 11 వేల 755 వద్ద ఉంది.

10:25 October 16

స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఆరంభంలో భారీ లాభాలతో ప్రారంభమైనా.. కాసేపటికే పడిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 150 పాయింట్లు పెరిగి.. 39 వేల 880 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 11 వేల 733 వద్ద ఉంది. 

బీపీసీఎల్​, దివీస్​ ల్యాబ్స్​, హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ లాభాల్లో ఉన్నాయి. యూపీఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, నెస్లే, ఏషియన్​ పెయింట్స్​, ఐఓసీ డీలాపడ్డాయి. 

09:01 October 16

బ్యాంకింగ్​ షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 40 వేల ఎగువన ట్రేడవుతోంది.  

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 314 పాయింట్ల లాభంతో 40,042 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 85 పాయింట్ల వృద్ధితో 11,765 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ ఇండ్​ బ్యాంక్, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యూపీఎల్​, ఏషియన్​ పేయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, ఐఓసీ, కోల్​ ఇండియాలు నష్టాల్లోకి వెళ్లాయి. ​ 

Last Updated : Oct 16, 2020, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details