దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు కోల్పోయి 40,627 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11,924 వద్ద కొనసాగుతోంది.
ప్రతికూల పవనాలతో నష్టాల్లో సూచీలు - stock market update
11:17 October 15
09:22 October 15
ప్రతికూల పవనాలతో స్వల్ప నష్టాల్లో సూచీలు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు.. బ్యాంకింగ్ రంగ షేర్లలో నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 12 మార్క్ దిగువన ట్రేడవుతోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి(బీఎస్ఈ)సూచీ సెన్సెక్స్.. 119 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి(ఎన్ఎస్ఈ)సూచీ నిఫ్టీ.. 23 పాయింట్ల క్షీణతతో 11వేల 949 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..
ఇన్ఫోసిస్, టాటా మోటర్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.