స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా లాభంతో 52,830 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా పెరిగి 15,886 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
Stock market: లాభాల్లో సూచీలు- సెన్సెక్స్ 200 ప్లస్ - షేర్ మార్కెట్ లైవ్ న్యూస్
స్టాక్స్ లైవ్ అప్డేట్స్
09:14 June 15
Stock market: లాభాల్లో సూచీలు- సెన్సెక్స్ 200 ప్లస్
ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
డాక్టర్ రెడ్డీస్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాల్లో ట్రేడవుతోంది.
తమ కంపెనీల్లో వాటాలున్న విదేశీ పెట్టుబడి సంస్థలకు సంబంధించి ఏ ఖాతాలనూ నిలిపివేయలేదని అదానీ గ్రూప్ స్పష్టతనిచ్చిన నేపథ్యంలో.. ఆ సంస్థ షేర్లు మంగళవారం కాస్త తేరుకుంటున్నాయి.