స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 209 పాయింట్లు బలపడి 52,653 వద్దకు చేరింది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 15,778 వద్ద స్థిరపడింది.
- టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్‌టెక్, సన్‌ఫార్మా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- మారుతీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఐటీసీ, హెచ్‌యూఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.