తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 287 డౌన్​ - షేర్ మార్కెట్ న్యూస్​

Stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Sep 30, 2021, 9:23 AM IST

Updated : Sep 30, 2021, 3:42 PM IST

15:40 September 30

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 287 పాయింట్లు కోల్పోయి 59,126 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 17,618 వద్దకు చేరింది. మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్​.

  • బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్ ఫినాన్స్, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​, సన్​ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.
  • పవర్​గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్​, యాక్సిస్ బ్యాంక్, బజాజ్​ ఆటో, ఎస్​బీఐ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు స్వల్ప లాభాలను గడించాయి. నిక్కీ (జపాన్​), హాంగ్​ సెంగ్ (హాంకాంగ్​) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

13:19 September 30

స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా కోల్పోయి 59,140 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు కోల్పోయి 17,622 వద్ద కొనసాగుతోంది.

  • బజాజ్ ఫినాన్స్​, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, బజాజ్ ఫిన్​సర్వ్​, టైటాన్​ లాభాల్లో ఉన్నాయి.
  • ఏషియన్ పెయింట్స్​, పవర్​గ్రిడ్​, బజాజ్ ఆటో, ఎస్​బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:52 September 30

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి నెమ్మదిగా తేరుకుంటున్నాయి. సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా పెరిగి 59,479 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పుంజుకుని.. 17,720 వద్ద కొనసాగుతోంది.

ఫార్మా షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఐటీ, ఆటో షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • సన్​ఫార్మా, టైటాన్​, ఎన్​టీపీసీ, బజాజ్ ఫిన్​సర్వ్​, డాక్టర్​ రెడ్డీస్ లాభాల్లో ఉన్నాయి.
  • పవర్​గ్రిడ్​, ఏషియన్ పెయింట్స్​, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:07 September 30

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు గురువారం కూడా (Stocks today) ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 60 పాయింట్లకుపైగా కోల్పోయి 59,351 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 10 పాయింట్ల నష్టంతో 17,703 వద్ద కొనసాగుతోంది.

  • టాటా స్టీల్​, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​టెక్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Sep 30, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details