తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరో రోజూ రికార్డులు- జీవితకాల గరిష్ఠాలకు సూచీలు - స్టాక్స్ లైవ్

stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్ అప్​డేట్స్

By

Published : Dec 8, 2020, 9:31 AM IST

Updated : Dec 8, 2020, 3:52 PM IST

15:44 December 08

నిఫ్టీ 37 ప్లస్..

స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 181 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,608 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,393 వద్దకు చేరింది.

ఐటీ, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

  • అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్​, రిలయన్స్, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్​, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:56 December 08

నిఫ్టీ@13,400

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్​ తర్వాత లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా పెరిగి.. నూతన రికార్డు స్థాయి అయిన 45,612 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంతో 13,393 వద్ద కొనసాగుతోంది.

మిడ్​ సెషన్ ముందు కొంత ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్​ వంటి హెవీ వెయిట్ షేర్ల దన్నుతో తిరిగి లాభాల్లోకి వచ్చాయి సూచీలు.

  • అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:03 December 08

కొనసాగుతున్న లాభాల పరంపర..

స్టాక్​ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూలతలతో మంగళవారం సెషన్​ను సానుకూలంగా ప్రారంభించాయి. బీఎఎస్​ఈ-సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయి అయిన 45,548 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంతో 13,392 వద్ద కొనసాగుతోంది.

సిమెంట్, మౌలిక వసతులు, వాహన, ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్​&టీ, మారుతీ, హెచ్​సీఎల్​టెక్, ఎల్​&టీ, టీసీఎస్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Dec 8, 2020, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details