తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల జోరు- భారీ లాభాల్లో మార్కెట్లు

stocks live updates
స్టాక్​ మార్కెట్లు లైవ్

By

Published : Apr 26, 2021, 9:31 AM IST

Updated : Apr 26, 2021, 11:54 AM IST

11:48 April 26

14,500 పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 660 పాయింట్లకుపైగా పెరిగి 48,538 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 180 పాయింట్ల లాభంతో 14,519 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

బ్యాంకింగ్ షేర్ల జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

  • ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్​బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా, సన్​ ఫార్మా మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:22 April 26

భారీ లాభాల్లో మార్కెట్లు

నాలుగో త్రైమాసిక ఫలితాలపై నెలకొన్న సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభ సెషన్​ను భారీ లాభాలతో ఆరంభించాయి.  

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 587 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 48,466 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ-నిఫ్టీ 161 పాయింట్ల లాభంతో 14,503 వద్ద ఉంది.

Last Updated : Apr 26, 2021, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details