తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market live: వరుసగా మూడోరోజూ మార్కెట్లకు నష్టాలే..

Stocks live updates
స్టాక్​ మార్కెట్లు

By

Published : Oct 21, 2021, 9:45 AM IST

Updated : Oct 21, 2021, 3:54 PM IST

15:46 October 21

మళ్లీ నష్టాల్లో..

స్టాక్స్​ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 336 పాయింట్లు కోల్పోయి.. 60,923 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 18,178 వద్ద ముగిసింది.

13:38 October 21

స్టాక్​ మార్కెట్ల సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్​ 650 పాయింట్లకుపైగా నష్టపోయి.. 60,590 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయి.. 18,086 వద్ద కొనసాగుతోంది.

  • కొటక్​ బ్యాంకు, పవర్​ గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • ఏషియన్ పెయింట్​, డాక్టర్​ రెడ్డీస్​, టాటా స్టీల్​, రిలియన్స్​, ఇండస్​ బ్యాంకు, ఇన్ఫోసిస్​ ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.​ 

10:59 October 21

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా కోల్పోయి.. 60,750 ఎగువన వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకుపైగా నష్టపోయి..18,140 వద్ద ట్రేడవుతోంది.   

10:11 October 21

దేశీయ స్టాక్​ మార్కెట్లు సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా కోల్పోయి 61,145 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి.. 18,243 వద్ద కొనసాగుతోంది.

09:02 October 21

ఒడుదొడుకుల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా మిశ్రమ పరిణామాల నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లు (Stock Market today) గురువారం సెషన్​ ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) దాదాపు 300 పాయింట్లకుపైగా లాభపడి.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 23 పాయింట్లు తగ్గి.. 61,236 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 9 పాయింట్లకుపైగా లాభంతో 18,276 వద్ద కొనసాగుతోంది.

  • కొటక్​ బ్యాంకు, సన్​ ఫార్మా, పవర్​గ్రిడ్​, నెస్లే, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • హెచ్​సీఎల్​ టెక్, టెక్​మహీంద్రా, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్​ బజాజ్​ ఆటో​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Oct 21, 2021, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details